News January 10, 2025
మోదీజీ.. ఇగో పక్కనపెట్టి రైతులతో చర్చించండి: ప్రియాంక
ఢిల్లీ సరిహద్దుల్లో నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లాల్ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ అన్నారు. రైతుల పట్ల కేంద్రం క్రూరంగా ప్రవర్తిస్తోందని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ప్రధాని మోదీ తన ఇగోను పక్కనపెట్టి అన్నదాతలతో చర్చలు జరపాలని సూచించారు. ఈ మొండి వైఖరే గతంలో 700 మంది రైతులను పొట్టనబెట్టుకుందని ప్రియాంక ఆరోపించారు.
Similar News
News January 10, 2025
బీఎల్ఎన్ రెడ్డిపై కొనసాగుతున్న ACB విచారణ
TG: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఆయన అధికారుల ఎదుట హాజరయ్యారు. అప్పటి నుంచీ అధికారులు ఆయన్ను పలు ప్రశ్నలపై విచారిస్తున్నారు. రేసు సమయంలో రెడ్డి HMDA ముఖ్య ఇంజినీర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో FEOకి 45.71 కోట్ల బదిలీ, HMDAపై ఆదాయ పన్ను భారంపై ఏసీబీ వరస ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
News January 10, 2025
మేం వచ్చాక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
AP: 1995లో ఏమీలేని స్థితి నుంచి HYDను అభివృద్ధి చేశామని CM చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఏపీ నిర్మాణ రంగ అభివృద్ధిపై దృష్టిసారించామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ₹4L Cr పెట్టుబడులకు సంతకాలు పూర్తయ్యాయని వెల్లడించారు. గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోలో మాట్లాడుతూ ‘YCP ప్రభుత్వం చేసిన అక్రమాలతో భూసమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.
News January 10, 2025
పన్నుల వాటా.. తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇలా
FY2024-25కు గాను పన్నుల వాటా కింద రాష్ట్రాలకు రూ.1,73,030 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అత్యధికంగా యూపీకి రూ.31,039 కోట్లు కేటాయించగా, ఏపీకి రూ.7,002 కోట్లు, తెలంగాణకు రూ.3,637 కోట్లు దక్కాయి. మూలధన వ్యయం, అభివృద్ధి, సంక్షేమ పనులకు ఈ నిధులను రిలీజ్ చేసింది. బిహార్‌కు రూ.17,403 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.13,582 కోట్లు, బెంగాల్‌కు రూ.13,017 కోట్లు కేటాయించింది.