News January 10, 2025

ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు.. 18న కీలక తీర్పు

image

సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు తీర్పును ట్రయల్ కోర్టు ఈనెల 18న వెలువరించనుంది. ఇప్పటికే CBI, నిందితుడు సంజయ్ రాయ్ తరఫు వాదనలు ముగిశాయి. తాము సమర్పించిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని సంజయ్‌కు మరణశిక్ష విధించాలని CBI కోరింది. అటు కేసులో సాక్ష్యాలను క్రియేట్ చేసి తన క్లయింట్‌ను ఇరికించారని నిందితుడి లాయర్ వాదించారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News February 9, 2026

సచిన్‌లానే వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలి: శశిథరూర్

image

అద్భుతమైన ఆటతీరుతో వైభవ్ సూర్యవంశీ <<19067167>>సంచలనాలు<<>> సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని సీనియర్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వైభవ్ మరింత త్వరగా ఉన్నత స్థాయికి చేరేందుకు అర్హుడని తాజాగా కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. ‘గతంలో 14 ఏళ్ల జీనియస్‌ను క్రీజులో చూశాం. అతడి పేరు సచిన్ టెండూల్కర్. అతడిని ఎక్కువ కాలం వేచి ఉండనివ్వలేదు’ అని పేర్కొన్నారు.

News February 9, 2026

క్లీనింగ్ టిప్స్..

image

* వంటింటి అరల్లో బేకింగ్ సోడాని నీళ్ళలో కలిపి సీసాలో వేసి మూలల్లో స్ప్రే చేస్తే దుర్వాసనల సమస్య తగ్గుతుంది. * బాత్‌రూం షవర్ రంధ్రాలు మూసుకుపోతే… దానిని వైట్ వెనిగర్‌తో శుభ్రం చేయాలి. * ఫర్నిచర్‌కు చెదలు పట్టకుండా ఉండాలంటే… కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ సమపాళ్ళలో కలిపి వాటిని తుడిస్తే సమస్య తగ్గుతుంది. * ఫ్రిజ్ లోపల దుర్వాసన వస్తోంటే వంటసోడాలో కాసిని నీళ్ళు కలిపి తుడిస్తే సరిపోతుంది.

News February 9, 2026

ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>ముంబై<<>> పోర్ట్ అథారిటీలో 24 జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్స్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిప్లొమా(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in