News January 10, 2025

తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

image

AP: తిరుమలలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామికి పూజలు, హారతి, పుష్ప సమర్పణ చేశారు. తె.4.30 నుంచి ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 10రోజులు శ్రీవారు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వనున్నారు. అటు శ్రీశైలంలో ఉత్తర ద్వారం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెలుపలికి తీసుకొచ్చి రావణ వాహనంపై గ్రామోత్సవం, రాత్రి వేళ పుష్పార్చన నిర్వహించనున్నారు.

Similar News

News November 2, 2025

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు విజయావకాశాలు: Lok Poll సర్వే

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని Lok Poll సర్వే తెలిపింది. 3,100 మందిపై సర్వే చేయగా 44% మంది కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని పేర్కొంది. బీఆర్ఎస్‌కు 38శాతం, బీజేపీ 15శాతం, ఇతరులు 3శాతం ప్రభావం చూపుతారని వెల్లడించింది. నిన్న విడుదలైన <<18171588>>కేకే సర్వేలో<<>> బీఆర్ఎస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఉపఎన్నిక ఈ నెల 11న జరగనుంది.

News November 2, 2025

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 16 ఉద్యోగాలు

image

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<>IOL<<>>) దులియాజాన్‌లో 16 కాంట్రాక్టువల్ డ్రిల్లింగ్/వర్క్ఓవర్ ఆపరేటర్, వర్క్‌ఓవర్ అసిస్టెంట్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా లేదా సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్: https://www.oil-india.com/ను సంప్రదించండి.

News November 2, 2025

ప్రతిరోజు తప్పక పఠించాల్సిన 4 మంత్రాలు

image

☞ ‘ఓం గం గణపతయే నమః’ రోజూ ఈ మంత్రం పఠించడం వల్ల అడ్డంకులు తొలగి, అంతర్గత శాంతి లభిస్తుంది.
☞ ‘ఓం నమః శివాయ’ ఈ పంచాక్షరీ మంత్రం ఏకాగ్రతను, సానుకూల శక్తిని, మానసిక బలాన్ని పెంచుతుంది.
☞ ‘ఓం హం హనుమతే నమః’ ఈ మంత్రం శారీరక బలంతో పాటు మీలో ధైర్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
☞ ‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః’ ఈ మంత్ర జపం సంపద, శ్రేయస్సును కలిగిస్తుంది. మీకు బలాన్ని పెంపొందిస్తుంది