News January 10, 2025

హరీశ్ రావు క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. హరీశ్ తన ఫోన్ ట్యాప్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జి.చక్రధర్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పలుకుబడి ఉన్న నేత కావడంతో హరీశ్‌ సాక్షులను ప్రభావితం చేయొచ్చని, ఆయనను అదుపులోకి తీసుకొని విచారించేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరారు.

Similar News

News January 10, 2025

ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ

image

TG: రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు తమ అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్య, నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి, కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లను పార్టీ ప్రకటించింది.

News January 10, 2025

‘వాంఖడే’కు 50 ఏళ్లు.. 19న MCA వేడుకలు

image

ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియం ప్రారంభమై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 19న MCA వేడుకలు నిర్వహించనుంది. గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి, సచిన్ లాంటి లెజెండరీ ప్లేయర్లతోపాటు రోహిత్, రహానే, సూర్య తదితర ముంబై క్రికెటర్లందరూ హాజరుకానున్నారు. 1974లో 33వేల మంది కెపాసిటీతో ప్రారంభమైన ఈ గ్రౌండులో ఇప్పటివరకు 56 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి.

News January 10, 2025

సంభల్ బావిపై స్టేటస్ కో కొనసాగించండి: SC

image

సంభల్‌లోని షాహీ జామా మసీదు వద్ద ఉన్న బావి విష‌యమై త‌మ అనుమతి లేకుండా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవద్దని స్థానిక యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మ‌సీదు స‌ర్వేను స‌వాల్ చేస్తూ క‌మిటీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై CJI బెంచ్ విచారించింది. బావి ప్ర‌దేశాన్ని హ‌రి మందిర్‌గా పేర్కొన‌డాన్ని పిటిష‌న‌ర్లు త‌ప్పుబ‌ట్టారు. స్టేట‌స్ కో కొన‌సాగించాల‌ని, ఎలాంటి ఆదేశాల‌ను అమ‌లు చేయ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.