News January 10, 2025
రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ పబ్లిక్ టాక్
‘గేమ్ ఛేంజర్’ బెన్‌ఫిట్ షోల సందడి మొదలైంది. మూవీ చూసినవారు IASగా చెర్రీ లుక్, యాక్టింగ్ అదిరిపోయాయని చెబుతున్నారు. ఇంటర్వెల్‌లో ఊహించని ట్విస్ట్ సెకండాఫ్‌పై మరింత హైప్ పెంచుతుందట. కమెడియన్లందరూ ఉన్నా కామెడీ లేకపోవడం మైనస్ అంటున్నారు. తమన్ BGM, SJ సూర్య, కియారా, అంజలి నటన బాగుందని చెబుతున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
Similar News
News January 10, 2025
క్షమాపణలు చెబితే సరిపోతుందా?: బొత్స
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ ఘటనకు కచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘భక్తులు భారీగా వస్తారని ముందే తెలిసినా చర్యలు తీసుకోలేదు. డిప్యూటీ సీఎం పవన్ క్షమాపణలు చెబితే సరిపోతుందా? ఈ ఘటనకు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? సామాన్యుల ప్రాణాలంటే సర్కార్‌కు ఇంత నిర్లక్ష్యమా’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News January 10, 2025
ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ
TG: రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు తమ అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్య, నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి, కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లను పార్టీ ప్రకటించింది.
News January 10, 2025
‘వాంఖడే’కు 50 ఏళ్లు.. 19న MCA వేడుకలు
ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియం ప్రారంభమై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 19న MCA వేడుకలు నిర్వహించనుంది. గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి, సచిన్ లాంటి లెజెండరీ ప్లేయర్లతోపాటు రోహిత్, రహానే, సూర్య తదితర ముంబై క్రికెటర్లందరూ హాజరుకానున్నారు. 1974లో 33వేల మంది కెపాసిటీతో ప్రారంభమైన ఈ గ్రౌండులో ఇప్పటివరకు 56 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి.