News March 17, 2024

బండారు సీటు కోసం టీడీపీ శ్రేణుల ర్యాలీ

image

పెందుర్తి నియోజకవర్గం టీడీపీ టికెట్ మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం సబ్బవరంలో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీడీపీకి నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారని, పొత్తులో భాగంగా ఈ సీటును బండారి కేటాయిస్తే అధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. మేరకు టీడీపీ నాయకులు, బండారు అనుచరులు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

Similar News

News April 10, 2025

షిప్ యార్డ్‌లో సొసైటీ కార్మికుడి మృతి

image

విశాఖలో షిప్ యార్డ్‌లో సొసైటీ కార్మికుడిగా పనిచేస్తున్న అప్పారావు విద్యుత్ షాక్‌కు గురై పైనుంచి కింద పడి మృతి చెందారు. నక్కవానిపాలెం ప్రాంతానికి చెందిన పిలక అప్పారావు బుధవారం హాల్ షాప్ విభాగంలో పనిచేస్తూండగా ఈ ప్రమాదం జరిగింది. పైనుంచి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మల్కాపురం సీఐ విద్యాసాగర్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.

News April 10, 2025

దంతెవాడ వరకే కిరండూల్ ఎక్స్‌ప్రెస్

image

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/58502) ఈనెల 14 నుంచి 22 వరకు అరకు-విశాఖ మధ్య నడుస్తుందని వాల్తేర్ DCM సందీప్ తెలిపారు. విశాఖ నుంచి బయలుదేరే కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్(18515/18516) ఈనెల 15 నుంచి 22 వరకు దంతెవాడకు తిరిగి 16 నుంచి 23 మధ్యలో విశాఖకు బయలుదేరుతుందన్నారు. డార్లిపుట్-పాడువా స్టేషన్ల పునర్నిర్మాణం, భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల కారణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు. 

News April 10, 2025

రెవెన్యూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి: కలెక్టర్

image

రెవెన్యూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో అధికారులు, సిబ్బంది వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో బుధ‌వారం రెవెన్యూ వ‌ర్క్ షాప్ నిర్వహించారు. రెవెన్యూ ప‌ర‌మైన అన్ని అంశాల‌పై, ప్ర‌భుత్వ జీవోల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌న్నారు. ఆక్ర‌మ‌ణ‌ల‌ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, రిజిస్ట్రేష‌న్‌లో అనుస‌రించాల్సిన విధానాల‌పై దిశానిర్దేశం చేశారు.

error: Content is protected !!