News January 10, 2025

‘హైడ్రా’ నిర్ణయం మంచిదే.. కానీ: వెంకయ్య

image

TG: కనుమరుగవుతున్న చెరువులను పరిరక్షించేందుకు హైడ్రా పేరిట సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిదేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అయితే ప్రభుత్వం అందరినీ సమదృష్టితో చూడాలని సూచించారు. ఆక్రమణల కూల్చివేతలతో నష్టపోయిన పేదలను ఆదుకోవాలన్నారు. దేశం బాగుండటం అంటే మనుషులతో పాటు నదులు, చెరువులు, అడవులు, పశుపక్షాదులు బాగుండాలని వెంకయ్య అన్నారు.

Similar News

News January 10, 2025

BREAKING: ‘తిరుపతి’ ఘటనపై హైకోర్టులో పిల్

image

AP: తిరుపతి తొక్కిసలాటపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనపై 5 రోజుల్లో న్యాయ విచారణ జరిపించి, 30 రోజుల్లో గవర్నర్‌కు నివేదిక ఇచ్చేలా పోలీస్ అధికారులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. మొత్తం 20 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్ త్వరలోనే విచారణకు రానుంది.

News January 10, 2025

‘గాలి’పై కేసుల విచారణ 4 నెలల్లో పూర్తిచేయాలి: సుప్రీంకోర్టు

image

ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 30న సీబీఐకి 4 నెలల గడువు ఇవ్వగా, తాజాగా మరింత గడువు ఇవ్వాలని అధికారులు కోరారు. దీంతో ధర్మాసనం మండిపడింది. మరో 4 నెలల్లో విచారణ పూర్తిచేయాలని, ఇకపై గడువు పెంచేది లేదని స్పష్టం చేసింది. 2011 నుంచి ఈ కేసుల విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

News January 10, 2025

తొలి వన్డేలో టీమ్ ఇండియా విజయం

image

ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 239 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 34.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. ప్రతికా రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53) అర్ధ సెంచరీలతో చెలరేగారు. స్మృతి మంధాన (41) పవర్‌ప్లేలో ధాటిగా ఆడారు. ఐర్లాండ్ బౌలర్లలో మాగూర్ 3 వికెట్లు, సార్జెంట్ ఓ వికెట్ పడగొట్టారు.