News January 10, 2025
విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ విమానాశ్రయం: సీఎం
TG: వరంగల్ మహానగరంగా ఎదగడానికి వీలుగా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని అధికారులకు CM రేవంత్ సూచించారు. మామునూరు విమానాశ్రయ భూ సేకరణ, ఇతర ప్రణాళికలపై సమీక్షించారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా ఎయిర్పోర్ట్ ఉండాలని, ద.కొరియాతో పాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు విమానాశ్రయాలను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని వివరించారు. కొచ్చి ఎయిర్పోర్ట్ను పరిశీలించాలని సూచించారు.
Similar News
News January 10, 2025
కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం
TG: కలెక్టర్లతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రైతుభరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. కొత్త పథకాల విధివిధానాల ఖరారుపైనా చర్చిస్తున్నారు.
News January 10, 2025
‘గేమ్ ఛేంజర్’ వచ్చేది ఈ OTTలోనే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజవగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రూ.450+ కోట్లతో రూపొందిన ఈ చిత్ర OTT హక్కులను ‘అమెజాన్ ప్రైమ్’ దక్కించుకుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. దాదాపు రూ.105 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిపాయి. అయితే, దాదాపు 6 వారాల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అంచనా వేశాయి.
News January 10, 2025
జై షాకు బీసీసీఐ సన్మానం
ఐసీసీ నూతన ఛైర్మన్ జై షాను సన్మానించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఆదివారం ముంబైలో జరిగే ప్రత్యేక సమావేశం అనంతరం షాకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాయి. షా ప్రస్తుతం బీసీసీఐలో ఏ హోదాలోనూ లేనప్పటికీ ఆయన్ను ప్రత్యేక అతిథిగా సమావేశానికి ఆహ్వానిస్తామని వెల్లడించాయి. బీసీసీఐ కొత్త కార్యదర్శి, కోశాధికారిని ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ఎన్నుకోనున్నారు.