News March 17, 2024
EDపై మోదీ ప్రశంసలు

అవినీతికి వ్యతిరేకంగా ED(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) చేస్తున్న కృషిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన.. తమ ప్రభుత్వం అవినీతిని సహించబోదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ అవలంబిస్తున్న కఠిన వైఖరిని ఆయన మెచ్చుకున్నారు. ఈడీ వంటి సంస్థలను కేంద్రం వాడుకుంటోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. అవి స్వేచ్ఛగా పని చేస్తాయని స్పష్టం చేశారు.
Similar News
News August 18, 2025
EPFOలో 230 ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ

EPFOలో 230 ఉద్యోగాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీలో రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది. లెవెల్-8, లెవెల్-10 వేతన శ్రేణి కింద జీతాలు అందుతాయి. <
News August 18, 2025
ఈ నెల 21న ఓయూకు సీఎం రేవంత్

TG: ఈ నెల 21న సీఎం రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు హాస్టళ్ల భవనాలను ఆయన ప్రారంభిస్తారు. అలాగే రూ.10 కోట్లతో నిర్మించనున్న డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ పనులను కూడా సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో ప్రొఫెసర్లు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ‘సీఎం రీసెర్చ్ ఫెలోషిప్’ పథకాన్ని ప్రారంభిస్తారు.
News August 18, 2025
కోహ్లీ దెబ్బకు రికార్డులన్నీ ‘సలామ్’ అనాల్సిందే!

టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ అరంగేట్రం చేసి నేటికి సరిగ్గా 17 ఏళ్లు. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన ODIలో విరాట్ డెబ్యూ చేశారు. ఆ తర్వాత ప్రపంచంలోనే మేటి ఆటగాడిగా ఎదిగారు. కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. దిగ్గజ ప్లేయర్లు నెలకొల్పిన ఎన్నో రికార్డులు కింగ్ ధాటికి సలామ్ అన్నాయి. T20, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నారు.