News January 10, 2025
KNR: సీఎంకు బండి సంజయ్ లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం తీరు ‘నోటితో పొగిడి – నొసటితో వెక్కిరించినట్లు ఉందన్నారు. ఆరోగ్య శ్రీ రూ.10లక్షలకు పెంచి ఆచరణకు వచ్చే సరికి అసలు బిల్లులే చెల్లించకుండా నెట్ వర్క్ హాస్పిటల్స్‌ను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు.
Similar News
News December 31, 2025
KNR: ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి

ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ఉచ్చులో చిక్కుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తోట ఆదిత్య(34) ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల ఏర్పడిన సమస్యలతో మనస్తాపానికి గురై తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
News December 30, 2025
కరీంనగర్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదొండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి.
News December 30, 2025
KNR: యూరియా సరఫరా నిరంతరం పర్యవేక్షించాలి

వ్యవసాయ అధికారులు ప్రతిరోజు మండల, క్లస్టర్ స్థాయిలో యూరియా సరఫరాను పర్యవేక్షించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల వ్యవసాయ అధికారులు, ప్రాథమిక సహకార సంఘాల అధికారులతో ఆమె మాట్లాడారు. యూరియా నిల్వలు, సరఫరా, వ్యవసాయశాఖ, కేంద్రప్రభుత్వ పథకాలు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై చర్చించారు.


