News January 10, 2025
కాంగ్రెస్, BRS మధ్య ‘బ్లాక్ బ్యాగ్’ విమర్శలు!
TG: ‘పదేళ్ల నుంచి దుమ్ము పట్టిన ఒక నల్ల బ్యాగు ACB ఆఫీసులో ఉంది. ఈ బ్యాగ్ ఎవరిదో చెప్పుకోండి’ అంటూ BRS ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన T కాంగ్రెస్ ‘ఆ నల్ల బ్యాగులో 2014 నుంచి మీరు చేసిన పాపాల చిట్టా ఉంది. ఆ బ్యాగును చూసి తెల్లమొహం వేసుకున్నాడా KTR? BRS దోపిడీ దొంగల అవినీతి వివరాలను నింపడానికి ఆ బ్యాగు సరిపోదు. KTR విచారణకు వెళ్లిన ప్రతిసారి బ్యాగులను లెక్కించమని చెప్పండి’ అని కౌంటర్ ఇచ్చింది.
Similar News
News January 10, 2025
పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఔట్..? స్పందించిన పీసీబీ
<<15098726>>స్టేడియాలు సిద్ధంగా లేకపోవడంతో<<>> పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ వేరే దేశానికి వెళ్లనుందని వచ్చిన వార్తలపై పీసీబీ స్పందించింది. సుమారు 12 బిలియన్(పాక్ రూపాయలు) వెచ్చించి స్టేడియాల్ని సిద్ధం చేశామని స్పష్టం చేసింది. స్టేడియాల సన్నద్ధతపై వచ్చిన వార్తల కారణంగా గందరగోళం ఉండకూడదనే ప్రకటన విడుదల చేశామని తెలిపింది. పనులు వేగంగా జరుగుతున్నాయని, టోర్నీ కచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేసింది.
News January 10, 2025
258మంది పాకిస్థానీలను వెళ్లగొట్టిన 7 దేశాలు
వివిధ అభియోగాలున్న 258మంది పాకిస్థానీ పౌరుల్ని 7 దేశాలు తమ భూభాగం నుంచి వెళ్లగొట్టాయి. పాకిస్థానీ మీడియా కథనం ప్రకారం.. సౌదీ అరేబియా అత్యధికంగా 232మందిని, యూఏఈ 21మందిని.. చైనా, ఇండోనేషియా, సిప్రస్, నైజీరియా, ఖతర్ తలా ఒకరిని తిప్పి పంపించాయి. వీరిలో ఏడుగురు యాచకులు ఉండటం గమనార్హం. 258మందిలో 16మందికి వీసా గడువు లేకపోవడంతో కరాచీకి రాగానే పాక్ అధికారులు అరెస్ట్ చేశారు.
News January 10, 2025
భార్య వైపు ఎందుకు తదేకంగా చూడకూడదు?: గుత్తా జ్వాల
వారానికి 90 గంటలు పనిచేయాలన్న L&T ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల మండిపడ్డారు. ‘నాకు అర్థం కాని విషయం ఏంటంటే.. భార్య వైపు భర్త ఎందుకు తదేకంగా చూడకూడదు? ఆదివారం మాత్రమే ఎందుకు చూడాలి? ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, విశ్రాంతి గురించి పట్టించుకోకుండా ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నమ్మలేకపోతున్నా’ అని ఆమె ఫైర్ అయ్యారు.