News March 17, 2024
అనకాపల్లి: కరెంట్ షాక్‌తో సచివాలయ ఉద్యోగి మృతి

దేవరాపల్లి (మం) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ డెక్క చిరంజీవి(32) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు విధినిర్వహణలో భాగంగా ములకలాపల్లి పాలకేంద్రం వద్ద విద్యుత్ స్తంభానికి కట్టిన పోస్టర్‌ను తొలగించాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎస్.ఐ డి.నాగేంద్ర ఘటనా స్థలానికి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Similar News
News April 10, 2025
మురళి నగర్‌లో యథావిధిగా మాంసం విక్రయాలు

మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు, జంతు వధ నిషేధమని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మహావీర్ జయంతి నాడు మాంసం దుకాణాలు తెరచినా, జంతు వధ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయకుండా మురళి నగర్‌లో యథావిధిగా మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవైందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News April 10, 2025
షిప్ యార్డ్‌లో సొసైటీ కార్మికుడి మృతి

విశాఖలో షిప్ యార్డ్‌లో సొసైటీ కార్మికుడిగా పనిచేస్తున్న అప్పారావు విద్యుత్ షాక్‌కు గురై పైనుంచి కింద పడి మృతి చెందారు. నక్కవానిపాలెం ప్రాంతానికి చెందిన పిలక అప్పారావు బుధవారం హాల్ షాప్ విభాగంలో పనిచేస్తూండగా ఈ ప్రమాదం జరిగింది. పైనుంచి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మల్కాపురం సీఐ విద్యాసాగర్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.
News April 10, 2025
దంతెవాడ వరకే కిరండూల్ ఎక్స్‌ప్రెస్

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/58502) ఈనెల 14 నుంచి 22 వరకు అరకు-విశాఖ మధ్య నడుస్తుందని వాల్తేర్ DCM సందీప్ తెలిపారు. విశాఖ నుంచి బయలుదేరే కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్(18515/18516) ఈనెల 15 నుంచి 22 వరకు దంతెవాడకు తిరిగి 16 నుంచి 23 మధ్యలో విశాఖకు బయలుదేరుతుందన్నారు. డార్లిపుట్-పాడువా స్టేషన్ల పునర్నిర్మాణం, భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల కారణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు.