News January 10, 2025

మెదక్: మోడల్ స్కూల్లో ప్రవేశాలు.. మిస్ చేసుకోకండి

image

తెలంగాణ మోడల్ స్కూల్‌లో 2025-26 ఏడాదిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి10వ ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవాలి. APRIL 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఝరాసంగం మోడల్ స్కూల్‌ ప్రిన్సిపల్ తేనావతి తెలిపారు.

Similar News

News January 10, 2025

మెదక్: కలెక్టరేట్‌లో రేపు వడ్డే ఓబన్న జయంతి

image

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేపు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అహ్మద్ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందని కార్యక్రమానికి జిల్లాలో ఉన్న వివిధ రాజకీయ ప్రతినిధులు, వివిధ సంఘలా సభ్యులు పాల్గొనాలని కోరారు.

News January 10, 2025

మునిపల్లి రిసార్ట్‌లో జంట సూసైడ్

image

పండగపూట సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మునిపల్లి మండలం భూసరెడ్డిపల్లి గ్రామ శివారులోని రిసార్ట్‌లో జంట సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారం.. ఓ జంట గురువారం సాయంత్రం రిసార్ట్‌లో రూం అద్దెకు తీసుకున్నారు. ఉదయం రిసార్ట్ యజమాని పరిశీలించగా ఇద్దరు ఉరివేసుకొని కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

News January 10, 2025

మెదక్: చనిపోయిన 5 నెలల తర్వాత పోస్టుమార్టం

image

రామాయంపేట మం. సుతారిపల్లికి చెందిన లక్ష్మి(48) మృతదేహానికి 5నెలల తర్వాత పోస్టుమార్టం నిర్వహించారు. లక్ష్మి చికిత్స పొందుతూ గతేడాది సెప్టెంబర్‌లో చనిపోగా అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తన తల్లి చికిత్స చేస్తుండగానే చనిపోగా వైద్యులు ఆ విషయం చెప్పకుండా డబ్బులు తీసుకున్నాకే మృతిచెందినట్లు చెప్పారని ఆమె కుమార్తె HYDలో ఫిర్యాదు చేసింది. దీంతో గురువారం గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.