News January 10, 2025
మహా కుంభమేళాలో ఈ బాబాలు స్పెషల్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఈనెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనున్న విషయం తెలిసిందే. 12 పుష్కరాల తర్వాత జరగనుండటంతో అన్ని ప్రాంతాల నుంచి భక్తులు, సాధువులు, అఘోరాలు నదీ స్నానానికి వెళ్తున్నారు. అయితే, ఇందులో రోజుకు పది కప్పుల టీ తాగుతూ జీవనం సాగిస్తున్న ‘చాయ్ వాలే బాబా’, తలపై వరి, శనగ మొక్కలను పెంచుతున్న అనాజ్ వాలే బాబా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.
Similar News
News January 10, 2025
258మంది పాకిస్థానీలను వెళ్లగొట్టిన 7 దేశాలు
వివిధ అభియోగాలున్న 258మంది పాకిస్థానీ పౌరుల్ని 7 దేశాలు తమ భూభాగం నుంచి వెళ్లగొట్టాయి. పాకిస్థానీ మీడియా కథనం ప్రకారం.. సౌదీ అరేబియా అత్యధికంగా 232మందిని, యూఏఈ 21మందిని.. చైనా, ఇండోనేషియా, సిప్రస్, నైజీరియా, ఖతర్ తలా ఒకరిని తిప్పి పంపించాయి. వీరిలో ఏడుగురు యాచకులు ఉండటం గమనార్హం. 258మందిలో 16మందికి వీసా గడువు లేకపోవడంతో కరాచీకి రాగానే పాక్ అధికారులు అరెస్ట్ చేశారు.
News January 10, 2025
భార్య వైపు ఎందుకు తదేకంగా చూడకూడదు?: గుత్తా జ్వాల
వారానికి 90 గంటలు పనిచేయాలన్న L&T ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల మండిపడ్డారు. ‘నాకు అర్థం కాని విషయం ఏంటంటే.. భార్య వైపు భర్త ఎందుకు తదేకంగా చూడకూడదు? ఆదివారం మాత్రమే ఎందుకు చూడాలి? ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, విశ్రాంతి గురించి పట్టించుకోకుండా ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నమ్మలేకపోతున్నా’ అని ఆమె ఫైర్ అయ్యారు.
News January 10, 2025
FLASH: కేటీఆర్‌పై కేసు నమోదు
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది. ఏసీబీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ-కార్ రేసు వ్యవహారంపై నిన్న ఏసీబీ అధికారులు ఆయనను విచారించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేటీఆర్ బీఆర్ఎస్ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లారని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు.