News January 10, 2025

నేడు TTD ధర్మకర్తల మండలి అత్యవసర భేటీ

image

AP: తిరుమలలో ఇవాళ సా.4 గంటలకు TTD ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం కానుంది. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై ఇందులో తీర్మానించనున్నట్లు సమాచారం. సాయంత్రానికి చెక్కులు తయారు చేసి, రేపు ఉదయానికల్లా ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం మృతుల గ్రామాలకే వెళ్లి వాటిని అందజేసే అంశంపైనా చర్చించనున్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News January 10, 2025

ఓటీటీలోకి సూపర్ హిట్ చిత్రం

image

బాసిల్ జోసెఫ్, నజ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ రేపు ఓటీటీలోకి రానుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలై దాదాపు రూ.60కోట్ల కలెక్షన్లను సాధించింది. ఎంసీ జతిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు IMDbలో 8.1 రేటింగ్ ఉంది.

News January 10, 2025

మెలోడీతో మీమ్స్.. స్పందించిన ప్రధాని మోదీ

image

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో తాను కలిసి ఉన్న ‘మెలోడీ’ మీమ్స్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘అది ఎప్పుడూ జరిగేదే. దాని గురించి ఆలోచించి నా సమయం వృథా చేసుకోను’ అని ఆయన చెప్పారు. WTF సిరీస్‌లో భాగంగా జెరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్ కాస్ట్‌లో మోదీ మాట్లాడారు. అలాగే తన చిన్నప్పుడు ఇంట్లో వారి బట్టలన్నీ తానే ఉతికేవాడినని చెప్పారు.

News January 10, 2025

ప్రభాస్ అభిమానులకు గుడ్, బ్యాడ్ న్యూస్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ గుడ్, బ్యాడ్ న్యూస్ అందనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేస్తారని సమాచారం. మరోవైపు ఈ చిత్ర విడుదలను ఏప్రిల్ 10 నుంచి వాయిదా వేస్తున్నట్లు టాక్. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.