News March 17, 2024
నా భర్తంటే ఇష్టంలేదు.. అందుకే విడాకులిచ్చా: నటి

ఒకప్పుడు తన భర్తే తనకు శత్రువు అని హీరోయిన్ మనీషా కోయిరాలా అన్నారు. ‘నా భర్తకు నాపై ఎప్పుడూ ప్రేమ లేదు. నాకు కూడా అతనంటే ఇష్టం లేదు. పెళ్లైన కొద్ది రోజులకే నాకు శత్రువుగా మారాడు. ఓ స్త్రీ జీవితంలో ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది. అందుకే అతడికి విడాకులు ఇచ్చా’ అని చెప్పారు. కాగా 2010లో బిజినెస్ మేన్ సామ్రాట్ దహల్‌ను మనీషా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 6 నెలలకే విడాకులు తీసుకున్నారు.
Similar News
News August 18, 2025
చాపకింద నీరులా ‘మార్వాడీ గో బ్యాక్’

గో బ్యాక్ మార్వాడీ ఉద్యమం <<17429087>>చాపకింద నీరులా<<>> తెలంగాణ అంతటా విస్తరిస్తోంది. ప్రాంతాలు, ఊర్ల వారీగా వాట్సాప్ గ్రూపుల్లో మార్వాడీల వ్యాపార తీరుకు వ్యతిరేకంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి ప్రభావితులైన వారు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. మూమెంట్‌పై ఇంటెలిజెన్స్ కూడా దృష్టిపెట్టిందని సమాచారం. ముందు రోహింగ్యాలను బయటకు పంపాలని BJP అనడంతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది.
News August 18, 2025
ఒడిశాలో బంగారు నిల్వలు.. త్వరలోనే తవ్వకాలు

ఒడిశాలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) గుర్తించింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో దాదాపు 20 మెట్రిక్ టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నట్లు అంచనా వేసింది. ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది కాస్త ఊరటనివ్వనుంది. ఇప్పటికే బంగారం మైనింగ్‌కు సంబంధించి ఒడిశా ప్రభుత్వం పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వేలం నిర్వహించనుంది.
News August 18, 2025
ఎల్లుండి వరకు ‘అన్నదాత సుఖీభవ’ గ్రీవెన్స్

AP: అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత ఉండీ లబ్ధి పొందని రైతులు ఈ నెల 20లోగా గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పరిశీలన, ధ్రువీకరణలో రిజెక్ట్ అయిన దరఖాస్తులు, ఈ కేవైసీ చేసుకోక తిరస్కరణకు గురైన రైతులు రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని చెప్పారు. కాగా గత నెల 27 వరకు స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి, అర్హులను గుర్తించి నిధులు జమ చేసినట్లు వెల్లడించారు.