News January 10, 2025

ఏడాదికి 10వేల కోట్ల అరటిపండ్లు లాగిస్తున్నారు

image

అరటిపండు పోషకాలు కలిగి ఉండటం వల్ల, రోజుకు ఒకటైనా తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. దీంతో ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పండుగా అరటిపండుకు పేరుంది. ఏటా 100 బిలియన్ల(10వేల కోట్లు) కంటే ఎక్కువ అరటిపండ్లను లాగిస్తున్నట్లు తెలుస్తోంది. పోషక ప్రయోజనాలు, సౌలభ్యం కారణంగా దీనికి ప్రజాదరణ లభించింది. చాలా చోట్ల ఆహారంలో అరటిపండునూ భాగం చేస్తుంటారు.

Similar News

News October 23, 2025

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

నిన్నమొన్నటి వరకూ కురిసిన వర్షాలు ట్రైలర్ మాత్రమేనని నేటి నుంచి TGలో అసలు వర్షాల జోరు మొదలవుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో పాటు హైదరాబా‌లోనూ చిరుజల్లులు పడొచ్చని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

News October 23, 2025

APPLY NOW: CERCలో ఉద్యోగాలు

image

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (CERC) 9 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, డిప్లొమా, CA, MA, ఎంబీఏ, పీజీడీఎం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: http://cercind.gov.in/

News October 23, 2025

భారత్ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

image

టీమ్ ఇండియాతో రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
భారత్: రోహిత్ శర్మ, గిల్ (C), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: హెడ్, మార్ష్(C), షార్ట్, రెన్‌షా, కారే, కొన్నోలీ, ఓవెన్, బార్ట్‌లెట్, స్టార్క్, జంపా, హేజిల్‌వుడ్.