News January 10, 2025
మేం వచ్చాక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
AP: 1995లో ఏమీలేని స్థితి నుంచి HYDను అభివృద్ధి చేశామని CM చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఏపీ నిర్మాణ రంగ అభివృద్ధిపై దృష్టిసారించామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ₹4L Cr పెట్టుబడులకు సంతకాలు పూర్తయ్యాయని వెల్లడించారు. గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోలో మాట్లాడుతూ ‘YCP ప్రభుత్వం చేసిన అక్రమాలతో భూసమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.
Similar News
News January 11, 2025
అంతర్జాతీయ క్రికెట్‌కు తమీమ్ ఇక్బాల్ మళ్లీ వీడ్కోలు
బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు మరోసారి వీడ్కోలు పలికారు. తన ఫేస్బుక్ పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఆయన 2023, జులై 6న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించారు. అప్పటి దేశ ప్రధాని హసీనా విజ్ఞప్తి మేరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈసారి మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌ను పూర్తిగా వీడుతున్నట్లు స్పష్టం చేశారు.
News January 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 11, 2025
శుభ ముహూర్తం (11-01-2025)
✒ తిథి: శుక్ల ద్వాదశి ఉ.8:06 వరకు
✒ నక్షత్రం: రోహిణి మ.12.28 వరకు
✒ శుభ సమయాలు ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30
✒ యమగండం: మ.1.30-3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.24-7.36
✒ వర్జ్యం: సా.5.51-7.22
✒ అమృత ఘడియలు: ఉ.9.20-10.59, రా.3.06-4.37