News January 10, 2025
మరో క్రికెటర్ విడాకులు?
భారత క్రికెటర్లు వైవాహిక జీవితాన్ని నిలుపుకోవడంలో విఫలం అవుతుండటం ఫ్యాన్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. క్రికెటర్లు వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. ఈ జాబితాలో మరో క్రికెటర్ మనీశ్ పాండే చేరినట్లు తెలుస్తోంది. 2019లో నటి ఆశ్రితా శెట్టిని మనీశ్ వివాహమాడిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసుకున్నారని, పెళ్లి ఫొటోలు డిలీట్ చేసుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
Similar News
News January 11, 2025
త్వరలోనే 8,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్
AP: వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఖాళీ లేకుండా భర్తీ చేయాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది అవసరమన్నారు. మెరుగైన సేవలు అందించేలా 7 నుంచి 8 వేల మంది నియామకాలకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రైమరీ ఆస్పత్రుల్లో 28.96%, జిల్లా ఆస్పత్రుల్లో 14.51%, మిగతా చోట్ల 63.40% సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు ఆయనకు వివరించారు.
News January 10, 2025
కుంభమేళాకు స్టీవ్ జాబ్స్ సతీమణి
UPలో జరగనున్న మహా కుంభమేళాకు యాపిల్ కోఫౌండర్, దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ జాబ్స్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని స్వామి కైలాషానంద మహారాజ్ వెల్లడించారు. ‘ఆమె మాకు కూతురులాంటిది. కమల అనే పేరు పెట్టాం. లారెన్ ఇక్కడకు రావడం రెండోసారి. వ్యక్తిగత ప్రోగ్రాం కోసం దేశానికి వస్తున్న ఆమె కుంభమేళాలో ధ్యానం చేస్తారు. తన గురువును కలుస్తారు. ఆమెను ఊరేగింపులోనూ చేర్చేందుకు ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నారు.
News January 10, 2025
కరెంటు ఛార్జీలపై శుభవార్త
AP: 2025-26 ఏడాదికి ప్రజలపై కరెంటు ఛార్జీల భారం ఉండదని విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఠాగూర్ రామ్ శుభవార్త చెప్పారు. రూ.14,683 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సహా రాయితీలన్నీ కొనసాగుతాయని తెలిపారు. ఇటీవల నిర్వహించిన బహిరంగ విచారణలో కరెంటు ఛార్జీలు పెంచొద్దని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేశాయని పేర్కొన్నారు.