News January 10, 2025

‘ఫన్ బకెట్’ భార్గవ్‌కు 20ఏళ్ల జైలు.. ఇదీ కేసు!

image

యూట్యూబర్ <<15118839>>భార్గవ్<<>> (ఫన్ బకెట్ ఫేమ్)కు 20ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈయనది విజయనగరం జిల్లా కొత్తవలస. చెల్లి అంటూనే విశాఖకు చెందిన 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు 2021లో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దిశ చట్టం కింద భార్గవ్‌ను అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణలో నేరం రుజువు కావడంతో విశాఖ పోక్సో కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.

Similar News

News January 11, 2025

జిల్లాలో నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన

image

విజయనగరం జిల్లాలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం పర్యటించనున్నారు. జిల్లాలో ఉన్న ఓ యూనివర్శిటీలో డ్రోన్ల తయారీ యూనిట్‌ను శనివారం ఉదయం 11 గంటలకు రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు.

News January 11, 2025

VZM: ఉపాధి హామీ పనులకు రూ.23 కోట్ల బిల్లులు అప్‌లోడ్

image

జిల్లాలో మంజూరైన ఉపాధి హామీ పనులకు రూ.23 కోట్ల బిల్లులను అధికారులు ఇప్పటివరకు అప్‌లోడ్ చేశారు. రూ.45 కోట్ల విలువైన 866 పనులు జిల్లాలో ఇప్పటివరకు పూర్తి అయ్యాయి. కేవలం రూ. 23 కోట్ల బిల్లులను మాత్రమే అప్లోడ్ చేయడంతో పూర్తి అయిన పనులకు కూడా వెంటనే బిల్లులు అప్‌లోడ్ చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

News January 10, 2025

పవన్ ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో: బొత్స

image

తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై MLC బొత్స సత్యనారాయణ విశాఖలో శుక్రవారం మాట్లాడారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కేసు విచారణ చేపట్టాలని కోరారు. భక్తులు చనిపోవడం దైవ నిర్ణయం అంటూ TTD ఛైర్మన్ బీఆర్.నాయుడు స్పందించిన తీరు తనను బాధించిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగిరావని, ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలన్నారు.