News January 10, 2025
258మంది పాకిస్థానీలను వెళ్లగొట్టిన 7 దేశాలు
వివిధ అభియోగాలున్న 258మంది పాకిస్థానీ పౌరుల్ని 7 దేశాలు తమ భూభాగం నుంచి వెళ్లగొట్టాయి. పాకిస్థానీ మీడియా కథనం ప్రకారం.. సౌదీ అరేబియా అత్యధికంగా 232మందిని, యూఏఈ 21మందిని.. చైనా, ఇండోనేషియా, సిప్రస్, నైజీరియా, ఖతర్ తలా ఒకరిని తిప్పి పంపించాయి. వీరిలో ఏడుగురు యాచకులు ఉండటం గమనార్హం. 258మందిలో 16మందికి వీసా గడువు లేకపోవడంతో కరాచీకి రాగానే పాక్ అధికారులు అరెస్ట్ చేశారు.
Similar News
News January 11, 2025
BREAKING: ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సి గోబీ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన ఇంట్లో గన్ షాట్‌కు గురైన ఆయనను కుటుంబ సభ్యులు అర్ధరాత్రి 12 గంటలకు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఆయనే గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేక మిస్ ఫైర్ జరిగి చనిపోయారా? అనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందని చెప్పారు.
News January 11, 2025
అది యాడ్ or వార్నింగ్? PIA ఫొటోపై సెటైర్లు
నాలుగేళ్ల తర్వాత పారిస్‌కు విమానాలను ప్రారంభిస్తున్నామంటూ పాక్ ఎయిర్‌లైన్స్ చేసిన పోస్టు ట్రోల్‌కు గురవుతోంది. ‘పారిస్.. మేం వస్తున్నాం’ అంటూ ఐఫిల్ టవర్ వైపు విమానం దూసుకెళ్తున్నట్లుగా ఆ ఫొటో ఉంది. దీంతో ‘US ట్విన్ టవర్స్‌పై లాడెన్ దాడి తరహాలో ప్లాన్ చేశారా? అది ప్రకటనా? లేక వార్నింగా?’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 2020లో కరాచీలో విమానం క్రాష్ తర్వాత ఆ ఎయిర్‌లైన్స్‌ను EU బ్యాన్ చేసింది.
News January 11, 2025
మస్క్ పిచ్చివాడవుతున్నారు: బయోగ్రఫీ రచయిత
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉండేకొద్దీ పిచ్చివాడవుతున్నారని ఆయన జీవిత కథ రాస్తున్న అబ్రామ్‌సన్ ఆరోపించారు. మస్క్ మానసిక ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘మస్క్‌కు పిచ్చి ఎక్కుతోందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆయన బయోగ్రాఫర్‌గా గడచిన రెండేళ్లుగా మస్క్ ఆన్‌లైన్ ప్రవర్తన నిశితంగా చూస్తున్నాను. భారీగా డ్రగ్స్ వాడకం, ఒత్తిడి కారణంగా ఎలాన్‌కు లోలోపల ఏదో తేడా చేసింది’ అని ట్వీట్ చేశారు.