News March 17, 2024

అశ్విన్‌కు 500గోల్డ్ కాయిన్లు.. రూ.కోటి నజరానా

image

టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌‌ను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఇటీవల టెస్టు క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు, 500 వికెట్ల మైలురాయి చేరుకున్నందుకు అతడికి 500 గోల్డ్ కాయిన్లు, రూ.కోటి నజరానా ప్రకటించింది.

Similar News

News April 9, 2025

కమెడియన్ సప్తగిరి తల్లి కన్నుమూత

image

ప్రముఖ కమెడియన్, హీరో సప్తగిరి ఇంట్లో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి చిట్టెమ్మ నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇవాళ తిరుపతిలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. దీంతో తోటి నటీనటులు సంతాపం తెలుపుతున్నారు.

News April 9, 2025

SI సుధాకర్‌పై వైసీపీ శ్రేణుల ఆగ్రహం

image

AP: మాజీ సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన <<16038250>>రామగిరి SI సుధాకర్‌పై<<>> YCP శ్రేణులు ఫైరవుతున్నాయి. ఆయన టీడీపీ కోసమే పనిచేస్తున్నారనే దానికి ఈ పొలిటికల్ విమర్శలే నిదర్శనమని పేర్కొంటున్నాయి. టీడీపీ నుంచి గుంతకల్ అసెంబ్లీ సీటుకు పోటీ అంటూ గతంలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను, లోకేశ్, అచ్చెన్న, సత్యకుమార్ తదితర మంత్రులతో ఆయన దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నాయి. ఇదేనా నీ నిజాయితీ అని ప్రశ్నిస్తున్నాయి.

News April 9, 2025

BREAKING: తైవాన్‌లో భూకంపం

image

తైవాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 మాగ్నిట్యూడ్ నమోదైంది. భూకంప ధాటికి రాజధాని తైపీలో భవనాలు షేక్ అయ్యాయి. 73 కి.మీ లోతులో భూమి కంపించిందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. నష్ట తీవ్రతపై వివరాలు తెలియాల్సి ఉంది. కాగా వివిధ దేశాల్లో వరుస భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల మయన్మార్, థాయిలాండ్‌లో భూకంపాల ధాటికి వేలాది మంది మరణించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!