News January 10, 2025

హంసలోని ఈ గొప్ప గుణం గురించి తెలుసా?

image

హంస నీటి నుంచి పాలను వేరు చేసి వాటిని మాత్రమే సేవిస్తుందని చెబుతుంటారు. దీంతోపాటు మరో గొప్ప గుణమూ హంసకు ఉంది. ఇవి తమ భాగస్వామితో బలమైన, జీవితకాల బంధాలను ఏర్పరచుకోవడంలో ప్రసిద్ధి చెందాయి. హంస తన భాగస్వామిని కోల్పోతే, అది తీవ్ర దుఃఖాన్ని అనుభవించడంతో ఆరోగ్యం క్షీణించి మరణిస్తుందని ప్రతీతి. ప్రతి ఒక్కరూ ఇలా తమ భాగస్వామిని ప్రేమించాలని ఉదాహరణగా వ్యాఖ్యానిస్తుంటారు.

Similar News

News October 15, 2025

కోడి పిల్లలను షెడ్డులోకి వదిలే ముందు జాగ్రత్తలు

image

కోడి పిల్లలను షెడ్డులోకి వదలడానికి 10 రోజుల ముందే షెడ్డును శుభ్రపరచి, గోడలకు సున్నం వేయించాలి. బ్రూడరు, మేత తొట్లు, నీటి తొట్లను క్లీన్ చేయాలి. వరి పొట్టును 2-3 అంగుళాల మందంలో(లిట్టర్) నేలపై వేసి.. దానిపై పేపరును పరచాలి. కోడి పిల్లల మేత, నీటి తొట్లను బ్రూడరు కింద ఒకదాని తర్వాత ఒకటి అమర్చాలి. బ్రూడరు చుట్టూ 2-3 అడుగుల దూరంలో 18 అంగుళాల ఎత్తుగా అట్టను వృత్తాకారంలో రక్షక దడిగా అమర్చాలి.

News October 15, 2025

గుడికి వెళ్తే తప్పకుండా తల స్నానం చేయాలా?

image

దైవ దర్శనానికి వెళ్లేముందు తలస్నానం తప్పక చేయాలని పండితులు సూచిస్తున్నారు. మన మనస్సు నిత్యం కామ, క్రోధ, లోభం వంటి అరిషడ్వర్గాలతో నిండి, అపవిత్రంగా ఉంటుంది. ఆ మనసును శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక శక్తి మనకు తక్షణమే లభించదు. కాబట్టి కనీసం శరీరాన్ని పూర్తిగా శుభ్రపరచుకుని, శుచిగా దైవ దర్శనం చేసుకోవాలి. శరీరంలాగే మన మనస్సు కూడా శుద్ధంగా, నిర్మలంగా ఉండాలని భగవంతుడిని వేడుకోవాలి. <<-se>>#DHARMASANDEHALU<<>>

News October 15, 2025

మీరు ఫోన్ ఎలా పట్టుకుంటున్నారు?

image

చాలామంది ఫోన్లను కిందకి పట్టుకుని తల వంచి చూస్తుంటారు. ఇప్పుడూ అలా చూస్తూనే చదువుతున్నారా? అయితే మీరు డిప్రెషన్‌కు దగ్గరగా ఉన్నట్లే. ఎక్కువసేపు తలవాల్చడం, లేజీగా కూర్చోవడం వల్ల వెన్నెముకతో పాటు బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడి డిప్రెషన్ ఫీలింగ్స్ పెరుగుతాయని డాక్టర్స్ చెబుతున్నారు. కళ్లు, ఫోన్ ఒకే లెవెల్‌లో ఉండాలని, 20 మినట్స్‌కు ఒకసారి బ్రేక్ తీసుకుని బాడీ స్ట్రెచ్ చేయాలని సూచిస్తున్నారు. SHARE IT