News January 10, 2025
రికార్డు సృష్టించిన స్మృతి మంధాన

ఐర్లాండ్ మహిళా టీమ్‌తో జరిగిన <<15119434>>తొలి వన్డేలో<<>> 29 బంతుల్లో 41 రన్స్ చేసిన స్మృతి మంధాన రికార్డు సృష్టించారు. అత్యంత వేగంగా(95 మ్యాచ్‌లు) 4,000 ODI పరుగులు పూర్తిచేసుకున్న తొలి భారత ప్లేయర్‌గా నిలిచారు. ఓవరాల్‌గా మూడో క్రీడాకారిణిగా ఘనత సాధించారు. ఆస్ట్రేలియాకు చెందిన బిలిందా క్లార్క్(86), మిగ్ లానింగ్(87) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. గతంలో మిథాలీరాజ్ 112 వన్డేల్లో ఈ ఫీట్ నమోదుచేశారు.
Similar News
News November 9, 2025
RITES 40పోస్టులకు నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(<
News November 9, 2025
కాంగ్రెస్, BRS నేతలను నిలదీయండి: కిషన్ రెడ్డి

TG: కేసీఆర్ తరహాలోనే రేవంత్ కూడా మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క అమ్మాయికీ పెళ్లి సమయంలో తులం బంగారం ఇవ్వలేదని విమర్శించారు. ‘పెన్షన్లు పెంచలేదు, కొత్తవి ఇవ్వలేదు. దళితులకు ఆర్థిక సాయం చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఎటు పోయాయని కాంగ్రెస్ నేతలను నిలదీయండి. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకివ్వలేదని బీఆర్ఎస్‌ను ప్రశ్నించండి’ అని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు.
News November 9, 2025
24MP ఫ్రంట్ కెమెరాతో ఐఫోన్18?

ఐఫోన్18 సిరీస్‌ను 2026 సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు యాపిల్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. A20 ప్రాసెసర్‌తో HIAA (హోల్ ఇన్ యాక్టివ్ ఏరియా) టెక్నాలజీని పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఐఫోన్ 18, 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో డిస్‌ప్లే కింద 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చనుందని వార్తలొస్తున్నాయి. 2027లో విడుదలయ్యే 18e మోడల్‌లో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫిక్స్ చేసే చాన్స్ ఉంది.


