News March 17, 2024
వారికి రైతు భరోసా ఇవ్వడం కుదరదు: CM

TG: రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘5 ఎకరాలలోపు ఉన్న దాదాపు 62 లక్షల మంది రైతులకు రైతుబంధు డబ్బు అందించాం. భవిష్యత్తులో రైతు భరోసా పథకం గుట్టలు, చెట్లు, లేఅవుట్లకు ఇవ్వడం కుదరదు. వ్యవసాయ భూమి ఉన్న వారెవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు’ అని రేవంత్ స్పష్టం చేశారు.
Similar News
News September 8, 2025
ములుగు: వాట్సాప్ చాట్ బాట్ ద్వారా విద్యుత్ ఫిర్యాదులు

విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం TGNPDCL ఆధ్వర్యంలో వాట్సాప్ చాట్ బాట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు డీఈ నాగేశ్వరరావు ఈరోజు తెలిపారు. వినియోగదారులు 7901628348 నంబర్‌కు హాయ్ పంపితే కంప్లైంట్ నమోదు, ట్రాక్, ఏజెంట్‌తో చాట్ వంటి సేవలు పొందవచ్చన్నారు. కంప్లైంట్‌కు ప్రత్యేక ID సృష్టించి SMS ద్వారా మెసేజ్ వస్తుందన్నారు. అదేవిధంగా 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
News September 8, 2025
నివేదా థామస్ లేటెస్ట్ ఫొటోస్ VIRAL

‘35 చిన్న కథ కాదు’ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన మలయాళ క్యూటీ నివేదా థామస్ తాజా ఫొటోలు వైరలవుతున్నాయి. వైట్ శారీలో ఓనమ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో గతంతో పోలిస్తే కాస్త బరువు తగ్గినట్లు ఉన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గద్దర్ అవార్డు వేడుకల సమయంలో నివేదా <<16710784>>బరువు<<>> పెరిగారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News September 8, 2025
దేశవ్యాప్తంగా అందుబాటులోకి VoNR: JIO

దేశం అంతటా VoNR (Voice over 5G) సేవలను JIO యాక్టివేట్ చేసింది. ఇప్పటివరకూ VoLTE ఉండగా ప్రస్తుతం 5G నెట్‌వర్క్‌పై పనిచేసే VoNR అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల నెట్‌వర్క్ వీక్‌గా ఉన్నప్పుడు 5G నుంచి 4Gకి మారడం లాంటి సమస్యలు ఉండవు. కాల్ నాణ్యత మెరుగవుతుంది. స్పష్టంగా వినిపిస్తుంది. కాల్ త్వరగా కనెక్ట్ అవుతుంది. బ్యాటరీ ఆదా అవుతుంది. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఇంటర్నెట్ వేగం తగ్గదు.