News January 10, 2025
HYD: ఎఫ్‌టీఎల్ వివాదానికి త్వరలో పరిష్కారం: రంగనాథ్

బుద్ధ భవన్ హైడ్రా కార్యాలయంలో దుర్గం చెరువు పరిసరవాసులతో కమిషనర్ రంగనాథ్ సమావేశం నిర్వహించారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో వివాదాలకు ఆస్కారం లేకుండా 4 నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మెన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో 6 కాలనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని వారి నుంచి సమాచారాన్ని లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మెన్ అందజేశారు.
Similar News
News January 17, 2026
సికింద్రాబాద్: ‘ర్యాలీకి పోలీసుల అనుమతి లేదు’

సికింద్రాబాద్ సాధన సమితి నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ సీపీ ఈ మేరకు స్పష్టం చేశారు. భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం రాజకీయ, ప్రజావర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
News January 17, 2026
హైదరాబాద్‌కు ‘ఊపిరి’.. పెరిగిన గాలి నాణ్యత

కాలుష్యానికి కేరాఫ్‌గా మారిన హైదరాబాద్‌కు కొంత ఉపశమనం లభించింది. సంక్రాంతి పండుగ సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో గాలి నాణ్యత కొంతమేర పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 50 కంటే తక్కువగా నమోదయింది. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వాహనాల అనవసర వాడకం తగ్గితే మంచి ఫలితం ఉంటుంది. అయితే సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగివస్తే మళ్లీ అదే తంతు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
News January 17, 2026
మేడారంలో రేపు రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం

రేపు మేడారంలో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. మేడారం హరిత హోటల్‌లో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. సచివాలయాన్ని దాటి తొలిసారిగా కేబినెట్ సమావేశం జరగడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సమావేశంలో మేడారం మాస్టర్ ప్లాన్‌పై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే MPTC, ZPTC, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్ల అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.


