News January 10, 2025

భద్రాద్రి: వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు విజయవంతం: కలెక్టర్

image

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతమైందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వహించారని చెప్పారు. ఉత్సవాల నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన భక్తులకు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News January 11, 2025

ఇల్లెందులో క్షుద్ర పూజలు కలకలం

image

ఇల్లెందు పట్టణంలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇల్లందులోని ఓ ఇంట్లో శివశక్తి దండుసారయ్య ఫొటోలు పెట్టి హతమార్చేందుకు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న దండుసారయ్య, అనుచరులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 11, 2025

ఏడేళ్ల చిన్నారిపై లైంగికదాడి

image

ఏడేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన ఘటన లక్ష్మీదేవిపల్లి మండలంలో జరిగింది. స్థానికంగా ఓ ప్రైవేటు మెస్‌లో వంట పనిచేస్తూ ఓ కుటుంబం నివాసముంటుంది. అక్కడే పనిచేస్తున్న మరో వ్యక్తి చాక్లెట్స్ ఇస్తానని చిన్నారిని నమ్మించి గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడుస్తూ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆ వ్యక్తికి దేహశుధ్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

News January 11, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} పలు శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} దమ్మపేటలో మంత్రి తుమ్మల పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాల అంతరాయం ∆} ఉమ్మడి జిల్లాలో ఎంపీ రామసహాయం పర్యటన