News January 11, 2025
జాబ్ చేయాలా? జబ్బు పడాలా?
ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలన్న L&T చీఫ్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన చెప్పినట్లు పని చేస్తే ఉద్యోగిపై శారీరకంగానే కాకుండా మానసికంగానూ ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పురుషులు 55 గంటలు, మహిళలు 40 గంటలకుపైగా పని చేస్తే గుండె జబ్బులు, డయాబెటిస్, ఒబెసిటీతో పాటు మరికొన్ని వ్యాధులు వస్తాయంటున్నారు. అవిశ్రాంతంగా పని చేయడం మంచిది కాదని చెబుతున్నారు.
Similar News
News January 11, 2025
15న బైడెన్ ఫేర్‌వెల్ స్పీచ్
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈనెల 15న ఆ దేశ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడి కాలమానం ప్రకారం రా.8 గంటలకు ఓవల్ ఆఫీస్ నుంచి ప్రెసిడెంట్ ఫేర్‌వెల్ స్పీచ్ ఇస్తారని వైట్‌హౌస్ తెలిపింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో బైడెన్ పదవీకాలం ఈనెల 20న ముగియనుంది. అదేరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేస్తారు.
News January 11, 2025
మార్చి 9న కెనడా కొత్త PM ప్రకటన
ట్రూడో రాజీనామా ప్రకటన నేపథ్యంలో కెనడా కొత్త PMని MAR 9న ప్రకటిస్తామని అధికార లిబరల్ పార్టీ తెలిపింది. ఆరోజు నిర్వహించే ఓటింగ్ ద్వారా నాయకుడిని ఎన్నుకుంటామని పేర్కొంది. అయితే కొత్తగా ఎన్నికయ్యే PMకి పెను గండం పొంచి ఉంది. మైనార్టీలో పడిపోయిన ప్రభుత్వంపై MAR 24న పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇందులో నెగ్గితేనే లిబరల్ పార్టీ నేత PMగా కొనసాగుతారు.
News January 11, 2025
ఎన్ని గంటలు కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నదే ముఖ్యం: రాజీవ్ బజాజ్
ఎన్ని గంటలు పని చేశామనే దానికంటే, ఎంత వర్క్ క్వాలిటీగా చేశామన్నదే ముఖ్యమని బజాజ్ ఆటో సంస్థ MD రాజీవ్ బజాజ్ అన్నారు. వారానికి 90 గంటలు పని చేయాలన్న సుబ్రమణ్యన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు. 90 గంటల పనే కావాలంటే అది పైస్థాయి ఉద్యోగుల నుంచే మొదలుపెట్టాలన్నారు. ఆదివారాలు కూడా పనిచేయాలంటూ లేబర్ నిబంధనలు అతిక్రమిస్తున్న సుబ్రమణ్యన్‌పై చర్యలు తీసుకోవాలని CPI(ML) MP రాజారామ్ డిమాండ్ చేశారు.