News March 17, 2024
నిజామాబాద్ లోక్‌సభ స్థానం.. మహిళా ఓటర్లే అధికం

నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో NZB అర్బన్, NZB రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్‌లో అత్యధికంగా 2.99 లక్షల ఓటర్లు ఉండగా.. ఆర్మూర్‌లో అత్యల్పంగా 2.10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే బాల్కొండ మినహా అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా NZB అర్బన్‌లో 289, NZB రూరల్‌లో 293 పోలింగ్ కేంద్రాలున్నాయి.
Similar News
News April 4, 2025
NZB: షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఖాయమేనా?

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న షబ్బీర్ ఆలీకి మంత్రి పదవి దక్కడం ఖాయమని చర్చ జరుగుతోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంత్రి వర్గ విస్తరణలో ఒక మైనార్టీ ఉంటారని చేసిన ప్రకటన ఇందుకు ఊతం ఇస్తోంది. ఈ ప్రకటన.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీల ఎంపికలో చోటు దక్కక నిరాశలో ఉన్న షబ్బీర్ ఆలీతో పాటు ఆయన అనుచరుల్లో మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది.
News April 4, 2025
నిజామాబాద్: దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్ జిల్లాలో గ్రామ పాలనాధికారులుగా పని చేయడానికి ఆసక్తి కలిగిన మాజీ వీఆర్ఓలు, వీఆర్ఎలు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అర్హత కలిగిన వారు ఈ నెల 16వ తేదీ లోగా గూగుల్ ఫామ్ https://forms.gle/AL3S8r9E2Dooz9Rc7లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాల కోసం https://ccla.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
News April 4, 2025
NZB: కూలీ పనికి వెళ్లి.. మృత్యు ఒడిలోకి

నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన గంగాధర్ గురువారం గోదావరి నదిలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. గోదావరి నదిలో పాడైపోయిన బోరు మోటారును తీయడానికి గంగాధర్ కూలీ పనికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.