News January 11, 2025
ప్రకాశం: దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాం: SP
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ఎలాంటి అవకతవకలకు, అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. గత 10 రోజులుగా నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమైన ఈ దేహదారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులకు ముందుగా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, బయోమెట్రిక్, ఎత్తు, ఛాతి వంటి టెస్టులు నిర్వహించారు.
Similar News
News February 5, 2025
ప్రకాశం: వరల్డ్ కప్ విజేతకు ఘన స్వాగతం
ఢిల్లీలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా జట్టు గెలుపులో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. శివారెడ్డి మంగళవారం తన స్వగ్రామం చేరుకున్నాడు. దీంతో అతనికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ ఊరి కుర్రాడు దేశాన్ని వరల్డ్ ఛాంపియన్‌గా నిలపడం గర్వకారణంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు
News February 4, 2025
దర్శి: గుప్తనిధుల కోసం తవ్వకాలు
దర్శి మండలం శివరాజ్ నగర్ శివారులోని శ్రీ సాయిబాబా గుడి శ్రీ దత్తాశ్రమం పక్కనగల కొండ పైన గుర్తుతెలియని కొందరు వ్యక్తులు గుప్తనిధుల కొరకు కొండను తవ్వుతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎస్ఐ మురళి తన సిబ్బందితో దాడి చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కొండను తవ్వుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మురళి తెలిపారు.
News February 4, 2025
ఒంగోలు: వైసీపీలో ఉండేది ఎవరు.?
ఒంగోలు కార్పొరేషన్ రాజకీయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది. దీంతో వైసీపీలో ఉండే కార్పొరేటర్లు ఎంత మంది అనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కార్పొరేటర్లలో అత్యధికులు బాలినేనికి సన్నిహితులు కావడం గమనార్హం.