News March 17, 2024

MBNR: 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి..

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపటి నుండి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష ఉంటుంది. గతంలో నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండేది కాదు. ఈ సారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా.. అనుమతి ఇస్తారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు.

Similar News

News September 3, 2025

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో వర్షాలు

image

గడిచిన 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. నేడు ఉదయం 7 గంటల సమయానికి అత్యధికంగా మహమ్మదాబాద్ మండలంలో 43.5 ఎంఎం వర్షపాతం, గండీడ్ మండలంలో 35.0 ఎంఎం వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా అడ్డాకుల మండలంలో 1.3 ఎంఎం వర్షపాతం నమోదైంది. కౌకుంట్ల మండలంలో మాత్రం ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. జిల్లావ్యాప్తంగా సగటున 10.9 ఎంఎం వర్షపాతం నమోదైంది.

News September 3, 2025

MBNR:ఓటర్ లిస్ట్.. మొత్తం 4,99,582

image

1.గండీడ్-32,246, 2. మహమ్మదాబాద్ – 31,291, 3. రాజాపూర్ -21,772, 4. నవాబుపేట -40,193, 5. మిడ్జిల్ -25,128, 6. మూసాపేట-21,549, 7. మహబూబ్ నగర్ రూరల్-34,806, 8. కౌకుంట్ల -16,987, 9. కోయిలకొండ -52,175, 10. జడ్చర్ల – 40,861, 11.హన్వాడ -40,392, 12.దేవరకద్ర -26,239, 13. సీసీ కుంట -31,056, 14. భూత్పూర్ -27,080, 15. బాలానగర్ -33,437, 16. అడ్డాకల్ -24,370 మంది ఓటర్లు ఉన్నారు.

News September 2, 2025

పాలమూరు: AHTU.. 22 కార్యక్రమాలు

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ‘ప్రజా భద్రత పోలీసు బాధ్యత” కార్యక్రమంలో భాగంగా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) గత నెల(ఆగస్టు) జిల్లా మొత్తం 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఎస్పీ డి.జానకి తెలిపారు. మహిళలు, పిల్లలను అక్రమ రవాణా చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే తక్షణమే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.