News March 17, 2024

వాళ్లను రాళ్లతో కొట్టించమంటారా?: CM రేవంత్

image

TG: గత పాలకులు చేసిన తప్పులకు ఎలాంటి శిక్షలుంటాయని ఎదురైన ప్రశ్నకు సీఎం రేవంత్ స్పందించారు. ‘ఓటమే వారికి పెద్ద శిక్ష. ఆ దెబ్బకు కిందపడి విరగడం కూడా మీరు చూశారు. అంతకంటే పెద్దశిక్ష ఏం ఉంటుంది. ఇంకా బలమైన శిక్షలేమైనా ఉంటే మీరే(రిపోర్టర్) సూచించాలి. అమరవీరుల స్తూపం వద్ద రాళ్లతో కొట్టించమంటారా?. మీ సూచనను ప్రభుత్వం పరిశీలిస్తుంది(నవ్వుతూ)’ అని రేవంత్ అన్నారు.

Similar News

News September 30, 2024

సెప్టెంబర్ 30: చరిత్రలో ఈరోజు

image

1951: సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు జననం
1961: భారత మాజీ క్రికెటర్ చంద్రకాంత్ పండిత్ జననం
1971: ఏపీ సీఎంగా పి.వి.నరసింహారావు ప్రమాణం
1980: మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ జననం
1993: మహారాష్ట్ర లాతూర్ భూకంపంలో 10,000 మంది మరణం
☞ అంతర్జాతీయ అనువాద దినోత్సవం

News September 30, 2024

సంగారెడ్డిలో హైడ్రా అత్యుత్సాహం ప్రదర్శించొద్దు: జగ్గారెడ్డి

image

TG: సంగారెడ్డి నియోజకవర్గంలో హైడ్రా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని మాజీ ఎమ్మెల్యే, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కూల్చివేతల పేరుతో నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించొద్దని అధికారులకు సూచించారు. ‘హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వరకే పరిమితమని CM చెప్పారు. ORR బయట ఏవైనా సమస్యలుంటే ముందుగా నా దృష్టికి తీసుకురండి’ అని అధికారులను ఉద్దేశించి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

News September 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.