News January 11, 2025

ఎన్ని గంటలు కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నదే ముఖ్యం: రాజీవ్ బజాజ్

image

ఎన్ని గంటలు పని చేశామనే దానికంటే, ఎంత వర్క్ క్వాలిటీగా చేశామన్నదే ముఖ్యమని బజాజ్ ఆటో సంస్థ MD రాజీవ్ బజాజ్ అన్నారు. వారానికి 90 గంటలు పని చేయాలన్న సుబ్రమణ్యన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు. 90 గంటల పనే కావాలంటే అది పైస్థాయి ఉద్యోగుల నుంచే మొదలుపెట్టాలన్నారు. ఆదివారాలు కూడా పనిచేయాలంటూ లేబర్ నిబంధనలు అతిక్రమిస్తున్న సుబ్రమణ్యన్‌‌పై చర్యలు తీసుకోవాలని CPI(ML) MP రాజారామ్ డిమాండ్ చేశారు.

Similar News

News January 11, 2025

తొలిరోజు కలెక్షన్లు రూ.186 కోట్లు: ‘గేమ్ ఛేంజర్’ టీమ్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.186 కోట్లు (గ్రాస్) వచ్చినట్లు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది గేమ్ ఛేంజింగ్ బ్లాక్‌బస్టర్ అంటూ పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు రూ.172 కోట్లు రాగా, అల్లు అర్జున్ ‘పుష్ప-2’కు రూ.294 కోట్లు వచ్చాయి.

News January 11, 2025

పంట వేయకున్నా రైతుభరోసా? మీ కామెంట్!

image

TG: రైతు పంట వేసినా, <<15120633>>వేయకపోయినా<<>> వ్యవసాయ యోగ్యమైన భూమి అయితే రైతుభరోసా ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ నిన్న చెప్పారు. ఈ నిర్ణయం ప్రకారం పంట వేయకుండా ఖాళీగా ఉన్న వందల ఎకరాలకు సైతం డబ్బులు అందుతాయని పలువురు చెబుతున్నారు. పెట్టుబడి సాయం పంట వేసిన వారికి మాత్రమే ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల అసలైన రైతులకే సాయం అందుతుందంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News January 11, 2025

సంక్రాంతి.. ఇలా ట్రాఫిక్ జామ్ తప్పించుకోండి!

image

HYD నుంచి విజయవాడ వైపుకి వెళ్లే వారికి పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు. పెద్ద అంబర్ పేట్ నుంచి చౌటుప్పల్ మీదుగా చిట్యాల వరకు వాహనాల రద్దీ ఉందని చెప్పారు. ఆ మార్గంలో వెళ్లకుండా ఘట్కేసర్ (ఎగ్జిట్-9) నుంచి భువనగిరి-వలిగొండ-రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవచ్చని తెలిపారు. అలాగే గుంటూరు వైపు వెళ్లేవారు బొంగులూరు (ఎగ్జిట్-12) గేటు నుంచి ఇబ్రహీంపట్నం-మాల్-దేవరకొండ మీదుగా వెళ్లాలని సూచించారు.