News January 11, 2025
15న బైడెన్ ఫేర్‌వెల్ స్పీచ్
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈనెల 15న ఆ దేశ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడి కాలమానం ప్రకారం రా.8 గంటలకు ఓవల్ ఆఫీస్ నుంచి ప్రెసిడెంట్ ఫేర్‌వెల్ స్పీచ్ ఇస్తారని వైట్‌హౌస్ తెలిపింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో బైడెన్ పదవీకాలం ఈనెల 20న ముగియనుంది. అదేరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేస్తారు.
Similar News
News January 11, 2025
పంట వేయకున్నా రైతుభరోసా? మీ కామెంట్!
TG: రైతు పంట వేసినా, <<15120633>>వేయకపోయినా<<>> వ్యవసాయ యోగ్యమైన భూమి అయితే రైతుభరోసా ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ నిన్న చెప్పారు. ఈ నిర్ణయం ప్రకారం పంట వేయకుండా ఖాళీగా ఉన్న వందల ఎకరాలకు సైతం డబ్బులు అందుతాయని పలువురు చెబుతున్నారు. పెట్టుబడి సాయం పంట వేసిన వారికి మాత్రమే ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల అసలైన రైతులకే సాయం అందుతుందంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News January 11, 2025
సంక్రాంతి.. ఇలా ట్రాఫిక్ జామ్ తప్పించుకోండి!
HYD నుంచి విజయవాడ వైపుకి వెళ్లే వారికి పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు. పెద్ద అంబర్ పేట్ నుంచి చౌటుప్పల్ మీదుగా చిట్యాల వరకు వాహనాల రద్దీ ఉందని చెప్పారు. ఆ మార్గంలో వెళ్లకుండా ఘట్కేసర్ (ఎగ్జిట్-9) నుంచి భువనగిరి-వలిగొండ-రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవచ్చని తెలిపారు. అలాగే గుంటూరు వైపు వెళ్లేవారు బొంగులూరు (ఎగ్జిట్-12) గేటు నుంచి ఇబ్రహీంపట్నం-మాల్-దేవరకొండ మీదుగా వెళ్లాలని సూచించారు.
News January 11, 2025
వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తాం: CM
AP: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు CM చంద్రబాబు తెలిపారు. ప్రథమ స్వాతంత్ర్య పోరాటంగా పరిగణించే సిపాయిల తిరుగుబాటుకు(1857) ముందే 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి ఓబన్న ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాథను స్మరించుకుందామన్నారు.