News January 11, 2025

ఫార్ములా ఈ-రేస్‌ HYD ఇమేజ్ పెంచింది: దానం

image

ఫార్ములా ఈ-రేస్‌ HYD ఇమేజ్ పెంచిందని అనటంలో ఎలాంటి అనుమానం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గతంలోనే ఫార్ములా-1 కోసం మాజీ సీఎం చంద్రబాబు హయాంలో భూసేకరణ జరిగి, అంతా సిద్ధమైనా కొన్ని కారణాలతో అప్పుడు అది జరగలేదన్నారు. అంతర్జాతీయ దృష్టిని కేంద్రీకరించడంలో ఫార్ములా ఈ-రేస్ దోహద పడిందన్నారు. అవినీతి జరిగిందా? లేదా? అన్నది ACB, ED, కోర్టు చెప్పే వరకు స్పందించడం కరెక్ట్ కాదన్నారు.

Similar News

News January 26, 2025

ఓయూలో బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును మార్చి 4వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 6వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

News January 25, 2025

HYDలో ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

image

HYDలో ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అని చెప్పి ఫేక్ వాచ్‌లను అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. చార్మినార్ పరిసరాల్లో ఈ ముఠా అమ్మకాలు జరపగా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6,037 వాచ్‌లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

News January 25, 2025

ఓయూలో వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.