News January 11, 2025
నేతన్నల సంక్షేమానికి అభయహస్తం పథకం

TG: రాష్ట్రంలోని చేనేత, జౌళి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.168కోట్లతో అభయహస్తం పథకం ప్రకటించింది. నేతన్న పొదుపు నిధి కింద రూ.115Cr కేటాయించింది. చేనేత కార్మికులు ప్రతినెలా తమ జీతంలో 8% పొదుపు చేస్తే ప్రభుత్వం 16% జమ చేస్తుంది. కార్మికులు ఏ కారణంతో మరణించినా నామినీకి రూ.5L అందించేందుకు నేతన్న భద్రతకు రూ.9Cr కేటాయించింది. వస్త్ర ఉత్పత్తులకు వేతన మద్దతుకు నేతన్న భరోసా కింద రూ.44Cr వెచ్చించింది.
Similar News
News November 9, 2025
ALERT.. వచ్చే 8 రోజులు జాగ్రత్త!

TG: ఈ నెల 11 నుంచి 19 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ADB, కొమురం భీమ్, నిర్మల్, NZB, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు (10°C కంటే తక్కువ) పడిపోవచ్చని అంచనా వేశారు. దక్షిణ, తూర్పు జిల్లాల్లో మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14°C-17°C మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు.
News November 9, 2025
ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ – రేణిగుంట మధ్య షికార్లు చేస్తున్నారని YCP ఆరోపించింది. ‘మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్ చేస్తున్నారు. ఉత్తుత్తి పర్యటనలతో హడావుడి చేయడం తప్ప మీడియాను, నాయకులను ఎవర్నీ కలవడం లేదు. కేవలం సినిమా షూటింగ్ గ్యాప్‌లో రిలీఫ్ కోసం ఇలా టూర్‌లకు వెళ్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.
News November 9, 2025
చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు: బండి

TG: పాతబస్తీలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ మత్తులో మైనర్ అమ్మాయిలను కొందరు ట్రాప్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ సినిమా లెవల్లో హైదరాబాద్ ఫైల్స్ సినిమా నడుస్తోంది. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు జరుగుతున్నాయి. బర్త్ డే కేక్స్‌లో డ్రగ్స్ పెట్టి మైనర్ గర్ల్స్‌ను బలి చేస్తున్నారు. పాతబస్తీలో అరాచకాలకు MIM అండదండలున్నాయి’ అని ఆరోపించారు.


