News March 17, 2024

కాంగ్రెస్‌లో చేరిన BRS ఎంపీ, ఎమ్మెల్యే

image

TG: BRS పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయమే కాంగ్రెస్ పార్టీలోకి గేట్లు తెరిచామని సీఎం రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో కాసేపటి క్రితం అన్నారు.

Similar News

News December 23, 2024

4 రోజుల పని చాలు: NR మూర్తికి కాంగ్రెస్ MP కార్తీ కౌంటర్

image

నిజానికి దేశం వారానికి 4 రోజుల పనివిధానం వైపు వెళ్లాలని కాంగ్రెస్ MP కార్తీ చిదంబరం అన్నారు. MON 12PM నుంచి FRI 2PM వరకే ఉండాలన్నారు. నారాయణ మూర్తి 70Hrs పని, మాస్ మైగ్రేషన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘సుదీర్ఘంగా పనిచేయడం అర్థరహితం. సమర్థతపై దృష్టి సారించాలి. రోజువారీ జీవితం పోరాటం, అసమర్థత, నాణ్యతలేని మౌలిక వసతులతో గడిచిపోతోంది. సమాజంలో సామరస్యానికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యం’ అని పేర్కొన్నారు.

News December 23, 2024

రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని TFCC నిర్ణయం

image

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌కు అండగా ఉంటామని తెలిపింది. వారి కుటుంబానికి సాయం చేసేందుకు మనీ డొనేట్ చేయాలని ఛాంబర్ మెంబర్లను కోరుతూ సర్క్యులర్ జారీ చేసింది.

News December 23, 2024

తప్పు చేసిన ఎవరినీ వదలం: మంత్రి కొల్లు రవీంద్ర

image

AP: మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం మాయం చేసింది వాస్తవం కాదా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. దారి మళ్లిన బియ్యం స్కామ్‌పై వివరణ ఇచ్చుకోలేని దుస్థితి ఆయనది అని ఎద్దేవా చేశారు. తప్పు చేయనప్పుడు దొంగలా తప్పించుకొని తిరగడమెందుకని నిలదీశారు. తప్పు చేసిన ఎవరినీ వదలబోమని చెప్పారు. రేషన్ కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తామని, విచారణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు.