News January 11, 2025

అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సు సీజ్: పొన్నం

image

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల వద్ద ప్రైవేటు ట్రావెల్స్ ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు. అదనపు ఛార్జీల పేరిట ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బస్సులు ఎక్స్‌ట్రా ఛార్జీలు అడిగితే ప్రయాణికులు రవాణా శాఖ దృష్టికి తేవాలని మంత్రి సూచించారు. ఆర్టీసీ అధికారులు డిపోల వద్ద తనిఖీలు చేయాలని ఆదేశించారు.

Similar News

News January 11, 2025

ముంబైలో ఒంటరిగానే పోటీ: సంజయ్ రౌత్

image

మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో శివసేన (UBT) ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ముంబై, నాగపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుంది. దీంతో ఇండియా కూటమి భవిష్యత్తు చర్చనీయాంశంగా మారింది.

News January 11, 2025

భారత T20 జట్టు సెలక్షన్‌పై రేపు మీటింగ్

image

ఇంగ్లండ్‌తో స్వదేశంలో T20 సిరీస్‌కు టీమ్‌ఇండియాను ఎంపిక చేసేందుకు రేపు ముంబైలో సెలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో టీ20 జట్టును మాత్రమే ఎంపిక చేస్తారని వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ జట్ల ఎంపికలపై ప్రస్తావన ఉండదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో జట్టులో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు ఇంగ్లండ్‌తో భారత్ 5 T20లు ఆడనుంది.

News January 11, 2025

జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి

image

TG: రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, నియోజకవర్గానికి 3,500 చొప్పున కేటాయిస్తామని వివరించారు. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.