News January 11, 2025
వెలుగులోకి కొత్త మోసం.. ప్రెగ్నెంట్ చేస్తే ₹10లక్షలు!

‘ప్రెగ్నెంట్ సర్వీస్’ పేరిట బిహార్‌లోని నవాదా జిల్లాలో ఓ ముఠా స్కామ్‌కు తెరలేపింది. పిల్లల్లేని మహిళల్ని గర్భవతులను చేస్తే ₹10లక్షలు, ప్రెగ్నెంట్ చేయడంలో విఫలమైనా ₹50,000-₹5L ఇస్తామని ఆ ముఠా సభ్యులు పలువురిని నమ్మించారు. ఆధార్, పాన్, ఫొటోలు తీసుకుని రిజిస్ట్రేషన్, హోటల్ బుకింగ్స్ పేరిట డబ్బులు వసూలు చేశారు. ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేసేవారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Similar News
News April 1, 2026
మార్కెట్లో బుల్ జోరు!

పశ్చిమాసియా యుద్ధ భయాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధర తగ్గడంతో ఇవాళ బుల్ జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 1,900 పాయింట్లు ఎగసి 73,835 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 570 పాయింట్లు లాభపడి 22,910 వద్ద ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.
News April 1, 2026
చికెన్ తింటున్నారా?

TGలో ఇవాళ్టి నుంచి చికెన్ షాపుల <<19529303>>బంద్<<>> కొనసాగనుంది. ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. తాజా చికెన్ దొరక్కపోతే నిల్వ ఉంచిన మాంసాన్ని వాడే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన మాంసంపై బాక్టీరియా చేరుతుంది. ఇలాంటి మాంసం తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నాన్‌వెజ్ ప్రియులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
News April 1, 2026
భారీగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ కూడా షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,970 పెరిగి రూ.1,51,480కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 ఎగబాకి రూ.1,38,850 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.15వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది.


