News January 11, 2025

పోరాట వీరుడు!

image

నేడు వడ్డే ఓబన్న జయంతి. ఈయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నమ్మిన బంటు. ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఉద్యమాలకు ఊపిరిపోశారు. ఓబన్న సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు 1807 జనవరి 11న జన్మించారు. నరసింహారెడ్డి తాతది ఇదే గ్రామం కావడంతో ఇరు కుటుంబాలకూ సంబంధాలు ఉండేవి. 1846 అక్టోబరు 6న బ్రిటిష్‌ వారితో పోరాటంలో ఓబన్న 39ఏళ్లకే వీరమరణం పొందారు. ఆ తర్వాత నరసింహారెడ్డిని ఉరితీశారు.

Similar News

News September 18, 2025

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. గురువారం జిల్లాలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ డివైజులతో వేలిముద్ర సేకరించారు. నేరాల కట్టడిపై నిఘా, రోడ్ సేఫ్టీ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఏదైనా సమస్య వస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గాని, డయల్ 100కు గాని ఫిర్యాదు చేయాలన్నారు.

News September 17, 2025

స్త్రీల ఆరోగ్యమే కుటుంబ బలానికి ఆధారం: నవ్య

image

కర్నూలు పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్, పోషణ్ మాహ్ కార్యక్రమాల్లో బుధవారం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.బి.నవ్య పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం పరిరక్షణతో కుటుంబ బలోపేతం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. సమతుల్య ఆహారం, యోగా, స్క్రీనింగ్ టెస్టులపై అవగాహన కల్పించారు. గర్భిణులకు శ్రీమంతం, పిల్లలకు అన్నప్రాశనం చేశారు.

News September 16, 2025

కర్నూలు: సత్తా చాటిన కడప జట్లు

image

కర్నూలులో రెండు రోజుల పాటు 17వ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి. బాలురు, బాలికల విభాగంలో కడప జట్టు మొదటి స్థానంలో నిలిచి డబుల్ క్రౌన్ సాధించింది. కర్నూలు బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. విజేతలకు జిల్లా ఒలంపిక్ సంఘ అధ్యక్షుడు రామాంజనేయులు, ఏపీ హ్యాండ్ బాల్ సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు బహుమతులు అందజేశారు.