News March 17, 2024
SRD: సిలిండర్ పేలి తాత, మనవరాలి మృతి

గ్యాస్ సిలిండర్ పేలి తీవ్రంగా గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 10న రాత్రి స్థానిక మాణిక్ ప్రభు వీధిలో ఎరుకల లక్ష్మన్న ఇంట్లో గ్యాస్ లీకై మంటలు అలుముకున్నాయి. ఆయన్ను కాపాడే క్రమంలో కోడలు సుగుణ, మనవరాలు కీర్తి(4) గాయపడ్డారు. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిచంగా చికిత్స పొందుతూ కీర్తి శుక్రవారం, నిన్న లక్ష్మన్న చనిపోయారు. తాత, మనుమరాలు మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News February 5, 2026
మెదక్: అర్ధరాత్రి మంత్ర పూజలు?

శివంపేట మండలంలోని అల్లీపూర్ గ్రామంలో నింగ బాలరాజ్, గోవర్ధన్ అనే అన్నదమ్ముల ఇంటి ముందు అర్ధరాత్రి జరిగిన అనుమానాస్పద పూజలు కలకలం రేపాయి. తెల్లవారుజామున ఇంటి ముందు మంత్ర పూజల గుర్తులు చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఎవరో కావాలనే భయపెట్టేందుకు ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
News February 5, 2026
తూప్రాన్: ఎన్నికల బరిలో తోటి కోడలు

తూప్రాన్ పట్టణ మున్సిపల్ పరిధి ఎన్నికల బరిలో తోటి కోడళ్లు పోటీ చేస్తున్నారు. ఒకరు తాజా మాజీ కౌన్సిలర్ కాగా, మరొకరు నూతనంగా ఎన్నికల బరిలో నిలిచారు. తూప్రాన్ మున్సిపల్ పరిధి 12వ వార్డులో తాజా మాజీ కౌన్సిలర్ బొంది అరుణ వెంకట్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఆమె తోటి కోడలు బొంది రజిని రాఘవేందర్ గౌడ్ 1వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె భర్త రాఘవేందర్ గౌడ్ ఇదే వార్డులో తాజా మాజీ కౌన్సిలర్‌గా ఉన్నారు.
News February 5, 2026
రేగోడ్: టాపర్‌గా నిలవండి.. రూ.5 లక్షలు గెలవండి!

రేగోడు, లింగంపల్లి, గజవాడ పాఠశాలల్లో ఓ సంస్థ ఆధ్వర్యంలో ‘చదువుకో తెలంగాణ’పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. టెన్త్ వార్షిక పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు రూ.5 లక్షల నగదు బహుమతి అందిస్తారని MEO గురునాథ్ తెలిపారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి అందిస్తున్న సాయం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


