News January 11, 2025
సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను బహిర్గతం చేయాలి: KTR

TG: సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్‌వాల్ కూలి ₹80cr ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని KTR అన్నారు. ఆ సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి ₹4,350cr కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పంచిపెట్టి భారీ స్కామ్‌కు తెరతీశారని ఆరోపించారు. సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారని, ఆ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 4, 2026
అదే రోజున ఓటీటీలోకి MSVPG ఏడు భాషల్లో రిలీజ్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం త్వరలో OTTలో సందడి చేయనుంది. ఇప్పటికే OTT సంస్థ జీ5 దీనిపై అనౌన్స్‌మెంట్ ఇచ్చినా డేట్ కన్ఫామ్ చేయలేదు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు.
News February 4, 2026
అసభ్యకరంగా కామెంట్స్.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఓ వ్యక్తి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తనను వేధిస్తున్నాడని ఆమె అతడి ఐడీతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ వేధింపులపై ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు సమర్థిస్తున్నారు.
News February 4, 2026
ఐఐటీ గోవాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


