News March 17, 2024
BRSను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు
TG: బీఆర్ఎస్ తరఫున 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కంటే ముందు.. జహీరాబాద్, నాగర్‌కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు బీజేపీలో, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్ఎస్‌కు ప్రస్తుతం నలుగురు ఎంపీలే ఉన్నారు.
Similar News
News October 30, 2024
TTD ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు
AP: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును ప్రభుత్వం ప్రకటించింది. 24 మంది సభ్యులతో పాలక మండలిని నియమించింది. కాగా బీఆర్ నాయుడు ఓ మీడియా ఛానల్ అధినేత. జ్యోతుల నెహ్రూ, ఎంఎస్ రాజు, నన్నూరి నర్సిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, సుచిత్ర యెల్లా, మల్లెల రాజశేఖర్ గౌడ్, ఆనంద్ సాయి, వేముల ప్రశాంతి, పనబాక లక్ష్మి, జస్టిస్ హెచ్ఎల్ దత్, ఆర్ఎన్ దర్శన్, బొంగునూరు మహేందర్‌లను మెంబర్లుగా ప్రకటించింది.
News October 30, 2024
మయోనైజ్‌పై ప్రభుత్వం నిషేధం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది అనారోగ్యాలకు కారణం అవుతున్న మయోనైజ్‌ను ఏడాది పాటు నిషేధిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మయోనైజ్‌ను వినియోగించకుండా హోటళ్లు, ఫుడ్‌స్టాళ్లలో తరచూ తనిఖీలు చేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. కాగా మయోనైజ్ తిని ఇటీవల హైదరాబాద్‌లో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.
News October 30, 2024
SPFకు సచివాలయ భద్రత
TG: రాష్ట్ర సచివాలయ భద్రత బాధ్యతను ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF)కు అప్పగించింది. ఇప్పటివరకు తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) విధులు నిర్వహించింది. పాత సచివాలయంలో 25 ఏళ్లుగా SPF సిబ్బందే భద్రతను పర్యవేక్షించారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం తర్వాత అప్పటి BRS సర్కార్ TGSPని నియమించింది. అయితే ఇటీవల బెటాలియన్ పోలీసుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా వారిని తొలగించినట్లు తెలుస్తోంది.