News January 11, 2025

HYD: పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్

image

ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 7వ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు 50 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్.. 21 దేశాల నుంచి వస్తున్నారు. వీరంతా తమ తమ దేశాలకు సంబంధించిన గాలి పటాన్ని ఎగరవేయనున్నారు. 

Similar News

News January 11, 2025

సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో రద్దీ

image

సంక్రాంతి సందర్భంగా స్కూళ్లకు వరుసగా సెలవులు రావడంతో హైదరాబాద్‌ ప్రజలు పల్లెలకు బయలుదేరారు. సొంత వాహనాలు ఉన్న వారు నిన్నటి నుంచే సొంతూళ్లకు పయనమయ్యారు. మరోవైపు రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణికుల సందడి నెలకొంది. సొంతూళ్లకు వెళ్లే వారితో సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్‌లు కళకళలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు పల్లెబాట పట్టడంతో రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి.

News January 11, 2025

శంషాబాద్: ప్రయాణికులు 2,3 గంటల ముందే చేరుకోవాలి

image

శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే దేశీయ,అంతర్జాతీయ ప్రయాణికులు తమ ప్రయాణ సమయానికి 2,3 గంటల ముందే చేరుకోవాలని అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని సకాలంలో విమానాశ్రయానికి చేరుకోవాలన్నారు. తనిఖీల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా డీజీ యంత్రం సేవలను వినియోగించుకోవాలన్నారు.

News January 11, 2025

బీన్యూ మొబైల్స్ వారి సంక్రాంతి ఆఫర్లు

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 సంవత్సరాలుగా 70 లక్షలకు పైగా మొబైల్ వినియోగదారుల అభిమానం, ఆదరణ చూరగొన్న ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ బీన్యూ మొబైల్స్ & ఎలక్ట్రానిక్స్ సంక్రాంతి ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, గృహోపకరణాలపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని సీఈఓ వై.సాయి నిఖిలేశ్ తెలిపారు. ప్రజలు ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు.