News January 11, 2025
జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి
TG: రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, నియోజకవర్గానికి 3,500 చొప్పున కేటాయిస్తామని వివరించారు. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
Similar News
News January 11, 2025
రూ.10వేల కోట్ల విలువైన భవనం.. బుగ్గిపాలు
లాస్ ఏంజెలిస్‌లో చెలరేగుతున్న కార్చిచ్చులో పలు ఖరీదైన భవనాలు తగలబడిన సంగతి తెలిసిందే. వాటిలో అత్యంత ఖరీదైన బిల్డింగ్ విలువ రూ.10వేల కోట్లు! లూమినార్ టెక్నాలజీస్ సీఈఓ ఆస్టిన్ రసెల్ దీనికి యజమాని. 18 పడక గదులతో కూడిన రాజభవనంలాంటి ఆ బిల్డింగ్ దావానలంలో కాలి బుగ్గిపాలైంది. కాగా.. రూ.16.5 కోట్ల లాటరీ గెలుచుకున్న ఎడ్విన్ కాస్ట్రో అనే వ్యక్తికి చెందిన భవనం కూడా తగలబడిపోవడం గమనార్హం.
News January 11, 2025
విరాట్, రోహిత్ మళ్లీ పరుగులు చేస్తారు: ఇంగ్లండ్ బౌలర్
ఫామ్ లేమితో సతమతమవుతున్న భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి గాడిలో పడతారని ఇంగ్లండ్ బౌలర్ టైమల్ మిల్స్ ధీమా వ్యక్తం చేశారు. ‘వారిద్దరికీ ఆ పేరు ఏదో యాదృచ్ఛికంగా వచ్చిపడింది కాదు. ఎన్నో పరిస్థితుల్లో, మరెంతో పోరాటంతో వేలాది పరుగులు చేశారు. క్రికెట్ ఆడిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఆ ఇద్దరూ ఉంటారు. వారు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. తిరిగి పుంజుకుంటారు’ అని పేర్కొన్నారు.
News January 11, 2025
ఎవరి మద్దతు కోరడం లేదు: DK శివకుమార్
కర్ణాటక CM మార్పు ఊహాగానాలపై Dy.CM DK శివకుమార్ స్పందించారు. సీఎంగా తన పేరు ప్రస్తావించాలని తాను ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదన్నారు. అలాగే తాను ఎవరి మద్దతూ కోరుకోవడం లేదని, MLAలు తనకు మద్దతుగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ‘నేను కర్మనే నమ్ముకున్నా. ఫలితాన్ని దేవుడికే వదిలేస్తా. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తా’ అని డికె పేర్కొన్నారు.