News January 11, 2025
భారత T20 జట్టు సెలక్షన్‌పై రేపు మీటింగ్
ఇంగ్లండ్‌తో స్వదేశంలో T20 సిరీస్‌కు టీమ్ఇండియాను ఎంపిక చేసేందుకు రేపు ముంబైలో సెలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో టీ20 జట్టును మాత్రమే ఎంపిక చేస్తారని వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ జట్ల ఎంపికలపై ప్రస్తావన ఉండదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో జట్టులో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు ఇంగ్లండ్‌తో భారత్ 5 T20లు ఆడనుంది.
Similar News
News January 11, 2025
విరాట్, రోహిత్ మళ్లీ పరుగులు చేస్తారు: ఇంగ్లండ్ బౌలర్
ఫామ్ లేమితో సతమతమవుతున్న భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి గాడిలో పడతారని ఇంగ్లండ్ బౌలర్ టైమల్ మిల్స్ ధీమా వ్యక్తం చేశారు. ‘వారిద్దరికీ ఆ పేరు ఏదో యాదృచ్ఛికంగా వచ్చిపడింది కాదు. ఎన్నో పరిస్థితుల్లో, మరెంతో పోరాటంతో వేలాది పరుగులు చేశారు. క్రికెట్ ఆడిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఆ ఇద్దరూ ఉంటారు. వారు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. తిరిగి పుంజుకుంటారు’ అని పేర్కొన్నారు.
News January 11, 2025
ఎవరి మద్దతు కోరడం లేదు: DK శివకుమార్
కర్ణాటక CM మార్పు ఊహాగానాలపై Dy.CM DK శివకుమార్ స్పందించారు. సీఎంగా తన పేరు ప్రస్తావించాలని తాను ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదన్నారు. అలాగే తాను ఎవరి మద్దతూ కోరుకోవడం లేదని, MLAలు తనకు మద్దతుగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ‘నేను కర్మనే నమ్ముకున్నా. ఫలితాన్ని దేవుడికే వదిలేస్తా. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తా’ అని డికె పేర్కొన్నారు.
News January 11, 2025
సంక్రాంతికి AP లోడింగ్!
సంక్రాంతికి AP సిద్ధమవుతోంది. అక్కలు, బావలు, మామలు, అల్లుళ్ల రాకతో తెలుగు లోగిళ్లు పండుగ శోభను సంతరించుకుంటున్నాయి. కొత్త బట్టలు, పిండి వంటలు, రంగవల్లులు, కుర్రాళ్ల సరదాలు, స్నేహితుల గెట్ టుగెదర్లు, కొత్త సినిమాలు.. ఇలా సంబరాల సరదా జోరందుకుంది. వీటితో పాటు కోడి పందేలు, ఎద్దుల పోటీలు, జాతరలకై బరులు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే చాలామంది స్వస్థలాలకు చేరుకోగా మిగిలినవారు రేపు, ఎల్లుండి చేరుకోనున్నారు.