News January 11, 2025
విజయవాడలో పవన్ కళ్యాణ్ పర్యటన
విజయవాడ నగరంలో శనివారం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. స్థానిక పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా తిలకించారు. ఈ మహోత్సవానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పవన్ పరిశీలించారు. పలు రకాల పుస్తకాలను స్వయంగా ఆయన పర్యవేక్షణ చేశారు. అనంతరం నిర్వహకులు పలు పుస్తకాలను పవన్‌కు అందించి వాటి విశిష్టతను వివరించారు.
Similar News
News January 11, 2025
విజయవాడలో పుస్తకాలు కొన్న పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుస్తకాలంటే అమితమైన ప్రేమ. పుస్తక ప్రియుడైన పవన్ విజయవాడ బుక్ ఫెయిర్‌ను శనివారం ఉదయం సందర్శించారు. మాములుగా ఐతే మధ్యాహ్నం నుంచి పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుంది. కానీ పవన్ కోసం ఉదయం రెండు గంటల పాటు స్టాల్స్‌ను ఓపెన్ చేసి ఉంచారు. దాదాపు రెండున్నర గంటలపాటు పలు పుస్తక కేంద్రాలకు వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేశారు. ప్రతి స్టాల్లో పుస్తకాలను పరిశీలించారు.
News January 11, 2025
వందే భారత్ సీటింగ్ సామర్థ్యం పెంచిన రైల్వే అధికారులు
విజయవాడ మీదుగా విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందే భారత్ సీటింగ్ సామర్థ్యాన్ని పెంచామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈనెల 13 నుంచి నం.20708, 20707 వందే భారత్ రైళ్లు 16కోచ్‌లతో నడుస్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఛైర్ కార్ కోచ్‌లను 7 నుంచి 14కి పెంచామని, తద్వారా 530గా ఉన్న ఈ రైళ్ల సీటింగ్ సామర్థ్యం 1,128కి చేరుకుంటుందని రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
News January 11, 2025
విజయవాడ: యువతి ఆత్మహత్య.. కేసు నమోదు
విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో వేముల సబ్బులు అనే యువతి ఆత్మహత్యపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆదివారం రామవరప్పాడు గ్రామంలో ఇంట్లో తండ్రి, కూతుర్లు ఉంటున్న సమయంలోనే మరొక గదిలోకి వెళ్లి యువతి ఉరివేసుకుని చనిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు.