News January 11, 2025

నల్గొండ: BRS రైతు మహాధర్నా మళ్లీ వాయిదా!

image

BRS రైతు మహాధర్నా మరోసారి వాయిదా పడింది. నల్గొండ టౌన్‌లో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. సంక్రాంతి పండుగ ప్రయాణాలు, విజ‌య‌వాడ-హైద‌రాబాద్ హైవేపై ట్రాఫిక్ ర‌ద్దీతో పాటు త‌దిత‌ర కార‌ణాల‌తో పండుగ త‌ర్వాత మ‌హాధ‌ర్నా నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. ఫార్ములా ఈ రేసు కేసులో KTR విచారణ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని BRS ముందుకు జరుపుతూ వస్తోంది. తాజాగా ఆయన విచారణ ముగిసిన సంగతి తెలిసిందే.

Similar News

News November 4, 2025

NLG: ఆందోళన బాటలో ప్రైవేట్ కాలేజీలు

image

జిల్లాలు ప్రైవేట్ కళాశాలలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాబితాన్ని నిరసిస్తూ ఎంజీయూ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు కళాశాల నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. సోమవారం నుంచి తరగతులతో పాటు కళాశాలల బంద్ చేపట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలల ఎదుట బంద్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

News November 4, 2025

NLG: పత్తి కొనుగోళ్లలో కొర్రీలు.. రైతులు బేజారు!

image

జిల్లాలో ప్రారంభించిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)పత్తి కొనుగోలు కేంద్రాలలో తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పత్తి మిల్లు యజమానులు దళారులు కుమ్మక్కై సీసీఐ కేంద్రాలలో పత్తి మద్దతు ధర రూ.8,110 ఉండగా.. తేమ ఉందని చెబుతూ రూ. 6,500కే కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు. తేమ శాతం 8 నుంచి 12% ఉంటేనే పత్తి కొంటామని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

News November 4, 2025

ధాన్యం సేకరణ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టండి: కలెక్టర్

image

మండల ప్రత్యేక అధికారులు తమ ప్రాంతాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ (KGBV) వంటి విద్యాసంస్థలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె సమీక్షలో అధికారులకు సూచించారు.