News January 11, 2025

‘గ్రీన్ ఎనర్జీ’లో ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం

image

AP: అనకాపల్లి(D) పూడిమడకలో త్వరలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని CM చంద్రబాబు చెప్పారు. దీంతో ఎరువులు, రసాయనాలు తయారవుతాయన్నారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ‘గ్రీన్ ఎనర్జీ రూపంలో రాష్ట్రానికి ₹10లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్‌ను వాడితే వేడి తగ్గుతుంది. రిలయన్స్ బయో కంప్రెస్డ్ గ్యాస్ తయారీకి 500 కేంద్రాలు ఏర్పాటు చేయనుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News November 9, 2025

ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

image

<>ఎయిమ్స్ <<>>మంగళగిరి 10 నాన్ ఫ్యాకల్టీ, కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం హార్డ్ కాపీని డిసెంబర్ 10 వరకు పంపాలి. సీనియర్ ప్రోగ్రామర్, అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్, బయో మెడికల్ ఆఫీసర్, లా ఆఫీసర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in

News November 9, 2025

అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం కూడా..

image

అయ్యప్ప దీక్ష 41 రోజుల పాటు ఉంటుంది. కానీ, దీని ప్రభావం ఆ భక్తులపై ఎప్పటికీ ఉంటుంది. ఈ దీక్ష ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. మెడలో రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. 41 రోజుల ఈ సామాన్య జీవనం దీక్షానంతరం ఆదర్శవంతమైన ఆరోగ్యకర అలవాటుగా మారుతుంది. శబరిలో స్వామి దర్శనంతో దీక్ష ముగుస్తుంది, కానీ ఆరోగ్య జీవనశైలి మాత్రం కొనసాగుతుంది.

News November 9, 2025

షట్‌డౌన్ ఎఫెక్ట్: 1,460 విమానాల రద్దు

image

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ఎఫెక్ట్ విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. రెండో రోజు ఏకంగా 1,460 విమాన సర్వీసులను ఎయిర్ లైన్స్ రద్దు చేశాయి. మరో 6 వేలకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. తొలి రోజు 1,025 విమానాలు రద్దు కాగా, 7 వేలకు పైగా డిలే అయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భద్రతా సమస్యల కారణంగా 40 మేజర్ ఎయిర్ పోర్టుల్లో 4 శాతం డైలీ సర్వీసులను క్యాన్సిల్ చేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది.