News January 11, 2025

సంక్రాంతి తర్వాత క్యాబినెట్ విస్తరణ: TPCC చీఫ్

image

TG: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ సంక్రాంతి తర్వాత ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ను మారుస్తున్నారన్న వార్తలపై తనకు సమాచారం లేదన్నారు. బలమైన నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో చేరికలను ప్రోత్సహించబోమని తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.

Similar News

News September 15, 2025

‘మిరాయ్’లో శ్రియ పాత్రపై ప్రశంసల వర్షం

image

సెకండ్ ఇన్నింగ్సులో శ్రియ సినిమాల్లో నటించే పాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘మిరాయ్’లో ఆమె పోషించిన అంబిక పాత్ర ఆ కోవలోకే వస్తుంది. మూవీలో ఆమె ప్రజెన్స్ అదిరిపోయిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తన నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారని, తెరపై ఆమె కనిపించిన ప్రతిసారి ఓ ఎమోషన్ క్యారీ చేశారని అంటున్నారు. సినిమాకు కీలకమైన పాత్రలో ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని కొనియాడుతున్నారు.

News September 15, 2025

రూ.5కే టిఫిన్.. ఈ నెలాఖరులోపు ప్రారంభం!

image

TG: హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఈ నెలాఖరు నుంచి రూ.5 కే టిఫిన్స్ అందించేందుకు GHMC సిద్ధమవుతోంది. పాత స్టాల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి ముందుగా 60 చోట్ల ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలు అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. ఒక్కో బ్రేక్ ఫాస్ట్‌కు రూ.19 ఖర్చవుతుండగా రూ.14 జీహెచ్ఎంసీ భరించనుంది.

News September 15, 2025

ఈ జపనీస్ టెక్నిక్​తో హెల్తీ స్కిన్

image

జపనీయులు చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు 4-2-4 టెక్నిక్ యూజ్ చేస్తారు. ముందుగా ఆయిల్​ బేస్డ్ క్లెన్సర్​తో ముఖాన్ని 4నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ బేస్డ్ క్లెన్సర్​తో 2నిమిషాలు సున్నితంగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చివర్లో 2 నిమిషాలు వేడినీటితో, మరో 2 నిమిషాలు చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ పద్ధతి వల్ల చర్మానికి డీప్ క్లెన్సింగ్ అవుతుంది. రక్తప్రసరణ పెరిగి చర్మం బిగుతుగా మారుతుంది.